“చేతినిండా పనిలేకపోతే నాకు చిరాకు దొబ్బుద్ది” అంటూ తన లేటెస్ట్ సినిమా ‘సౌఖ్యం’ తో ప్రేక్షకులముందుకు వస్తున్నాడు యాక్షన్ హీరో గోపీచంద్. మనం మాత్రమే బాగుంటే సరిపోదు మన చుట్టుపక్కల ఉన్నవారు కూడా సౌఖ్యంగా ఉండాలని ఆలోచించే ఒక యువకుడే ఈ ‘ సౌఖ్యం’ అంటున్నారు చిత్ర దర్శక నిర్మాతలు. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఏ. యెస్. రవికుమార్ దర్శకత్వం వహించాడు. తాజాగా చిత్ర ట్రైలర్ రిలీజ్ అయింది. గోపీచంద్ సరసన రెజీనా కథానాయికగా నటించిన ఈ చిత్రానికి శ్రీధర్ సీపాన కథ అందిస్తుండగా, కోనవెంకట్ ,గోపీమోహన్ మాటలు అందించారు. అనూప్ రూబెన్స్ అందించిన ఈ చిత్ర పాటలు ఇటీవలే విడుదలయ్యాయి. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ఈ చిత్రం విడుదలకాబోతోంది.
Watch Trailer: