అక్రమ సంబంధాన్ని బయటపెట్టిన గూగుల్ మ్యాప్స్ ఎలానో తెలిస్తే షాక్ అవుతారు.?

గూగుల్ వల్ల మనం చాలా సమయాన్ని కాపాడుకోగలుగుతున్నాం, మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది గూగుల్. నెట్ లో ఏదైనా వెతకాలి అంటే గూగుల్, వీడియోస్ చూడాలి అంటే యూట్యూబ్ (గూగుల్), కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు వాడే యాప్ మ్యాప్స్ (గూగుల్), చాలా వరకు ఫోన్స్ లో వాడే సాఫ్ట్ వేర్ ఆండ్రాయిడ్ (గూగుల్). ఇలా లాప్టాప్ మొదలు ఫోన్ల వరకు అన్ని గూగుల్ మయమే, ఇదిలా ఉంటె గూగుల్ వల్ల ఒక జంట విడిపోయింది.

వివరాల్లోకెళితే..

పేరూ లోని లిమా లోని ఒక పాపులర్ బ్రిడ్జి కి సంబందించిన పిక్స్ ని గూగుల్ స్ట్రీట్ వ్యూ లో ఒక వ్యక్తి చూస్తున్నాడు, ఆ పిక్స్ లో బెంచ్ మీద ఒక మహిళ ఒక అబ్బాయి ఒళ్ళో తల వాల్చుకొని పడుకుంది, ఆమె మొకం బ్లర్ చేసి ఉంది, మాములుగా గూగుల్ స్ట్రీట్ వ్యూ లో పిక్స్ ఉంటాయి ఒక వేళా ఆ పిక్స్ లో మనుషులు ఉంటె వారి మోకాలను బ్లర్ చేస్తుంది గూగుల్, ఆ అమ్మాయి మొకం కూడా అందుకే బ్లర్ అయి ఉంది, ఆమె బట్టలు, షేప్ చూసి ఆ వ్యక్తికి అనుమానం వచ్చింది, ఆ బట్టలు మాదిరిగానే తన భార్య దెగ్గర కూడా ఉన్నాయ్ అని, ఆ అమ్మాయి ఆకారం తన భార్య లాగే ఉంది అని, తన భార్య మీద నిఘా పెట్టాడు, తన భార్య ను ఆ పిక్ చూపించి నిలదియ్యగా, అసలు నిజం బయటపడింది. పెళ్లి అయినా ఇంకొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంది అని ఆ వ్యక్తికి గూగుల్ ద్వారా తెలిసింది.

ఆ తరువాత ఏమైందంటే.?

ఇంకేముంది, ఇద్దరు విడాకులు తీసుకున్నారు. గూగుల్ దయ వల్ల బండారం బయట పడింది, కాపురం కూలిపోయింది, గూగుల్ తో జాగ్రత్తగా ఉండాలి సుమీ..!!

Comments

comments

Share this post

scroll to top