సూది లేకుండా రక్తం సేకరించే విధానాన్ని కనిపెట్టి పేటెంట్ హక్కు కు ఫైల్ చేసిన గూగుల్.

ప్రపంచాన్ని చిటికెలో మన ముందుంచుతూ…. ఇంటర్నెట్ రంగంలో రారాజుగా ఉన్న గూగుల్ సంస్థ..తాజాగా సూది లేకుండా రక్తాన్ని సేకరించే విధానాన్ని కనిపెట్టి, దానికి  “needle-free blood draw” అనే పేరు పెట్టి, పేటెంట్ హక్కుకు ఫైల్ చేసింది. గ్యాస్ ద్వారా ఈ పరికరం పనిచేస్తుంది. దీనిని మణికట్టుకు లేదా చేతివేళ్లకు ధరించవచ్చు… అలా ధరించిన పరికరాన్ని ఆన్ చేయగానే అధిక ప్రెషర్ తో మన అమర్చిన ప్రాంతానికి చిన్న రంధ్రాన్ని చేసి, ఆ రంధ్రం నుండి రక్తాన్ని సేకరిస్తుంది…రక్త సేకరణ అయిన వెంటనే నెగటివ్ సర్చ్  ద్వారా ఏర్పడిన రంధ్రం  మూసివేయబడుతుంది.

డయాబెటిస్ తో బాధపడే వారి సంఖ్య అధికమవుతున్నఈ తరుణంలో వారికి సూదులు గుచ్చుకునే బాధనుండి తప్పించాలని ఈ పరికరం తయారు చేసినట్టు తెలుస్తుంది. అయితే అలా కూడా వ్యాపారంపై కన్నేసారు గూగుల్ గాయ్స్.

Watch Video:

Comments

comments

Share this post

scroll to top