రోజుకు 4 కోట్లు అత‌ని జీతం…అయినా సుంద‌ర్ పిచాయ్‌ త‌ల్లిదండ్రులు ఉండే ఇళ్ళు ఇది.!

గూగుల్ సీఈవో సుంద‌ర్ పిచాయ్‌. ఈయ‌న పేరు తెలియ‌ని వారుండ‌రు. 2015వ సంవత్స‌రంలో ప్ర‌ఖ్యాత సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్‌లో సీఈవోగా చేరిన‌ప్ప‌టి నుంచి ఆయ‌న ఖ్యాతి ద‌శ‌దిశ‌లా వ్యాప్తి చెందింది. ఒక అమెరిక‌న్ కంపెనీకి భార‌తీయుడు సీఈవో అయ్యాడ‌ని చాలా మంది పిచాయ్‌ను కొనియాడారు. ఈ క్ర‌మంలోనే అత్య‌ధిక వేత‌నాలు తీసుకుంటున్న సీఈవోల జాబితాలో ఆయ‌న చేరిపోయాడు. ప్ర‌స్తుతం పిచాయ్ జీతం రోజుకు రూ.3.82 కోట్ల‌ట తెలుసా..? అయితే ఇంత మొత్తంలో జీతం, విలాస‌వంత‌మైన సదుపాయాలు ఉన్న‌ప్ప‌టికీ పిచాయ్ త‌ల్లిదండ్రులు మాత్రం చెన్నైలో ఇంకా డబుల్ బెడ్‌రూం ఇంట్లోనే ఉంటున్నారు. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. ఈ క్ర‌మంలోనే పిచాయ్‌కు చెందిన ఇలాంటి ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

గూగుల్ సీఈవో సుంద‌ర్ పిచాయ్ తండ్రి ఓ ఎల‌క్ట్రిక‌ల్ ఇంజినీర్‌. చెన్నైలో వీరు నివాసం ఉండేవారు. అప్ప‌ట్లోనే పిచాయ్ తండ్రికి రూ.3వేల జీతం అందేది. దీంతో వారి జీవితం సాఫీగానే గ‌డిచేది. అలా పిచాయ్ తండ్రి త‌నకు వ‌చ్చే జీతంలో కొంత సొమ్మును నెల నెలా పోగు చేసి 3 ఏళ్ల‌కు స్కూట‌ర్ కొన్నాడు. కాగా పిచాయ్‌కు చిన్న‌ప్ప‌టి నుంచే టెక్నాల‌జీ అంటే చాలా ఇష్ట‌మ‌ట‌. దీన్ని పిచాయ్ తండ్రి గ‌మ‌నించాడు. అందుకే పిచాయ్‌కు మంచి స్కూల్‌లో చ‌దువు చెప్పించాడు. ఇక ఐఐటీ ఎంట్ర‌న్స్ రాసి ఐఐటీ ఖ‌రగ్‌పూర్‌లో పిచాయ్ చ‌దివాడు. త‌రువాత అమెరికాకు వెళ్లి అక్క‌డే ఎంఎస్‌, ఎంబీఏ చేశాడు. ఆ త‌రువాత 2002లో గూగుల్‌లో ఉద్యోగిగా జాయిన్ అయ్యాడు. ఈ క్ర‌మంలోనే 2015వ సంవ‌త్స‌రంలో గూగుల్ సీఈవో అయ్యాడు పిచాయ్.

ఈ జూలై 12వ తేదీతో పిచాయ్ 45 ఏళ్లు పూర్తి చేసుకుని 46వ వ‌సంతంలోకి అడుగు పెట్టాడు. కాగా ఇంత పెద్ద పొజిష‌న్‌లో ఉండి, విలాస‌వంత‌మైన స‌దుపాయాల‌ను పొందుతున్న‌ప్ప‌టికీ పిచాయ్ తల్లిదండ్రులు మాత్రం ఇంకా చెన్నైలోని ఓ చిన్నపాటి డ‌బుల్ బెడ్‌రూం ఫ్లాట్‌లోనే ఉంటున్నారు. పిచాయ్ వేరే ఇల్లు కొంటాన‌ని చెప్పినా వారు అందుకు ఒప్పుకోలేదట‌. ఎందుకో తెలుసా..? అది పిచాయ్ పెరిగిన ఇల్లు క‌నుక‌. అందుక‌ని వారు అందులోనే ఉంటున్నారు. ఇక పిచాయ్‌కు మెమొరీ ప‌వ‌ర్ ఎంతంటే.. దాని గురించి అత‌ని తండ్రే ఓసారి చెప్పాడు. పిచాయ్ చిన్న‌ప్పుడు ఒక‌సారి ఇంట్లో ఉన్న‌ప్పుడు ఎవ‌రో పిచాయ్ తండ్రికి ఫోన్ నంబ‌ర్ ఇచ్చార‌ట‌. దీంతో ఆయ‌న ఆ నంబ‌ర్‌ను త‌న భార్య (పిచాయ్ త‌ల్లి)కి నోట్ చేసుకోమ‌ని చెప్పాడ‌ట‌. కానీ ఆమె నోట్ చేసుకోలేదు. త‌రువాత కొద్ది రోజుల‌కు ఆ నంబ‌ర్ కావాల‌ని పిచాయ్ తండ్రి అడిగాడు. దీంతో ఆమె రాసుకోలేద‌ని చెప్పింది. అయితే ఆ నంబర్ చెప్పిన‌ప్పుడు దాన్ని అక్క‌డే ఉన్న పిచాయ్ విన్నాడు. ఒక్క‌సారికే ఆ నంబ‌ర్‌ను గుర్తు పెట్టుకున్నాడు. తండ్రి అడగ్గానే వెంట‌నే నంబర్ చెప్పేశాడ‌ట‌. అదీ.. సుంద‌ర్ పిచాయ్‌కు ఉన్న మెమొరీ ప‌వ‌ర్‌. అందుకే గూగుల్ సీఈవో అయ్యాడు..!

Comments

comments

Share this post

scroll to top