జులై 27 న బయలుదేరిన ట్రైన్ మిస్సింగ్..?

జులై 27 సాయంత్రం … రాజస్థాన్ లోని జోథ్ పూర్ నుండి  గుజరాత్ లోని ముంద్రా రేవుకు బయల్దేరిన గూడ్స్ రైలు ఇప్పటి వరకు అక్కడికి చేరుకోలేదు. కేవలం మూడు రోజుల వ్యవధిలో చేరుకోవాల్సిన ట్రైన్ ఇప్పటి వరకు ఆ ప్రాతానికి చేరుకోకపోవడం  తో  ఆ ట్రైన్ ను బుక్ చేసుకున్న  ఎక్స్ ఫోర్ట్  బిజినెస్ మ్యాన్ రంజన్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు.

ఆ ట్రైన్ లోని మొత్తం 90 కంటెయినర్లలో ఒక్కక్క దాంట్లో 10 లక్షల విలువైన సామాగ్రి ఉందని, మొత్తం 9 కోట్ల విలువైన సామాగ్రి ఆ రైలు లో ఎక్స్ పోర్ట్ కోసం  బుక్ చేసుకున్నానని రంజన్ తెలిపాడు.  దీనిపై రంజన్ . రైల్వే శాఖను సంప్రదించగా, ఆగస్టు 2 నుంచి ఆ రైలు అహ్మదాబాదులో ఉన్నట్లు ఆన్ లైన్ స్టేటస్ చెబుతోంది. అక్కడ చూస్తే రైలు లేదు.

వర్షాల కారణం గా రైలు ఎక్కడైనా చిక్కుకుపోయిందా ? లేక ఎవరైనా దుండగులు హైజాక్ చేశారా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయ్. మూడు రోజుల్లో చేరాల్సిన ట్రైన్ 17 రోజులైనా చేరకపోవడాన్ని ఇంత వరకు మన రైల్వే అధికారులు గుర్తించకపోవడం ఎంటి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయ్..

ఇది గూడ్స్ ట్రైన్ కాబట్టి పెద్ద ప్రాణ నష్టం ఏం లేదు , మరి పాసింజర్ రైలు అయిన పరిస్థితి ఇలాగే ఉండేదా  అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయ్.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top