జియో సిమ్ వాడుతున్న ఆండ్రాయిడ్ యూజర్స్ కి గొప్ప శుభవార్త…..

టెలికాం రంగంలో విప్లవం సృష్టించి మిగతా టెలికాం సంస్థల్ని కోలుకోలేని దెబ్బతీసింది జియో.. జియో పుణ్యమా అని ఇప్పటికే ఫ్రీ కాల్స్, ఫ్రీ నెట్ సదుపాయంతో అందరూ జియో వైపు మొగ్గుచూపుతున్నారు… తాజాగా జియో తన ఆండ్రాయిడ్ కస్టమర్ల కోసం మరో సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తుంది. అదే గ్రూప్ కాలింగ్ సదుపాయం అంటే ఆండ్రాయిడ్ కస్టమర్లు ఒకేసారి పది మందితో కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడవచ్చు. అయితే ఇది ఆడియో కాల్ ద్వారానే అందుబాటులోకి వస్తుంది. దీని కోసం జియో ఓ కొత్త అప్లికేషన్ ను తయారుచేసింది. ఈ అప్లికేషన్ త్వరలోనే గూగుల్ ప్లే స్టోర్ లో లభించనుంది.

ఇది గూగుల్ ప్లే స్టోర్‌లో లభిస్తుంది. జియో సిమ్ వాడుతున్న ఆండ్రాయిడ్ వినియోగదారులు ఒకేసారి పది మందితో కాన్ఫరెన్స్ కాల్ (ఆడియో మాత్రమే) ద్వారా మాట్లాడుకోవచ్చు.

లెక్చర్ మోడ్, మ్యూట్ పార్టిసిపెంట్ వంటి ఇతర ఫీచర్లను కూడా ఇందులో జోడించింది. ప్రస్తుతం పరీక్ష దశలో ఉన్న ఈ యాప్‌ని అతి త్వరలో జియో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానుంది.

 

Comments

comments

Share this post

scroll to top