మిస్టరీ: యువతిపై అత్యాచారం.? గొంతు నులిమి చంపి, కిరోసిన్ పోసి కాల్చేశారు.! తండ్రే చేశాడా.?

ఆడపిల్లలపై రోజురోజుకి అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి..నిర్భయ లాంటి కఠిన చట్టాలు చేసినా ఫలితం లేదు సరికదా..మృగాలు మరింత రెచ్చిపోయి చేసే అత్యాచారాలు,హత్యలకు అంతం లేకుండా పోతుంది.ప్రపంచంలో ఏదో మూలా ,ప్రతి సెకెన్ అమ్మాయిలు ఇలాంటి బాదలు ఎదుర్కొంటూనే ఉన్నారు. అలాంటి ఘటనే సిద్దిపేటలో చోటుచేసుకుంది..పదిహేడేళ్ల బాలికను అత్యాచారం చేసి,పెట్రోల్ పోసి తగలబెట్టిన ఘటన సంచలనం సృష్టిస్తుంది..

గొంతు నులిమి చంపి కిరోసిన్‌తో పోసి కాల్చేసిన ఘటన శుక్రవారం రాత్రి సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం రుద్రారంలో చోటుచేసుకుంది.రుద్రారానికి  చెందిన చెట్టకాడి లక్ష్మి, సంజీవులు దంపతులకు ఇద్దరు కూతుళ్లు.వారిలో చిన్నది పదిహేడేళ్ల  సుహాసిని.తల్లి లక్ష్మి రెండేండ్ల క్రితం చనిపోయింది..పిల్లలిద్దరు తండ్రి ,నాన్నమ్మతో రుద్రారంలోనే ఉంటున్నారు.సుహాసిని ఇంటర్‌ రెండవ సంవత్సరం మధ్యలోనే ఆపేసింది.ఇంటి దగ్గరే ఉంటూ తండ్రితో పొలం పనులు చూస్కుంటూ ఉంటుంది. శుక్రవారం ఉదయం మొక్కజొన్న చేను వద్దకు వెళ్లొస్తానని వెళ్లిన  సుహాసిని తిరిగి ఇంటికి రాలేదు.మనమరాలు రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో  ఆమె నానమ్మ.. కొడుకు సంజీవులుకు ఫోన్‌ చేసి అదే విషయం  చెప్పింది.దాంతో అతడు చేను వద్ద వెతకగా సుహాసిని కాలిపోయిన శవమై కనిపించింది.

మొదట సుహాసినిని ఎవరైనా అత్యాచారం చేసి,హత్య చేసారేమో అనే అనుమానంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.కాని ఘటన గురించి తెలియగానే పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడంపై తండ్రి సంజీవులునే అనుమానించారు. అంతేకాదు సంజీవులు పొంతన లేకుండా సమాధానం చెబుతుండడం కూడా ఈ అనుమాలకు బలం చేకూరుస్తుంది.. వివాహేతర సంబంధం ఉండడం వల్లే కూతురి అడ్డు తొలగించుకునేందుకు తండ్రే హత్య చేసి ఉంటాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. డాగ్‌స్క్వాడ్‌ను పిలిపించగా అది సంజీవులు వద్ద ఆగింది. అయితే, తండ్రే హత్య చేశాడా? లేక వేరేవరైనా అత్యాచారం చేసి,ఆ విషయం బైటికి వస్తుందని చంపేశారా? అనేది ఇంకా తెలియరాలేదు.

Comments

comments

Share this post

scroll to top