గోనగన్నారెడ్డి ఘనమైన చరిత్ర…6 నిమిషాల వీడియోలో.

చరిత్ర తెలిసిన వారికి తప్ప చాలా మందికి గోనగన్నారెడ్డి అంతగా పరిచయం లేని పేరు, కానీ గుణశేఖర్ రుద్రమదేవి సినిమాతో గోనగన్నారెడ్డి ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు. రుద్రమదేవి గెలిచిన యుద్దాల్లో గోనగన్నారెడ్డి సహాయం మరువలేనిది. ఏదో సినిమాకోసం గోనగన్నారెడ్డి క్యారెక్టర్ లో సమూలమైన మార్పులు చేశారు కానీ…గోనగన్నారెడ్డి ఓ ఆదర్శ రాజు…. అతనికి సంబంధించిన చరిత్ర ఓ 6 నిమిషాల వీడియోలో రూపొందించారు తెలుగు వన్ వారు.. ఆ వీడియో ఇక్కడ మీకోసం.

ఇక చరిత్ర విషయానికి వస్తే…గోనగన్నారెడ్డి తండ్రి గోన బుద్దారెడ్డని, రుద్రమదేవి తాత రుద్రదేవుడు  వర్థమానపురానికి సామంతరాజుగా నియమించాడు..తీవ్ర అనారోగ్యంలో ఉన్న సమయంలో గోనబుద్దారెడ్డి తన తమ్ముడైన లకుమయరెడ్డిని పిలిచి….నా తర్వాత గోనగన్నారెడ్డిని రాజుగా చేయమని చెప్పి మరణిస్తాడు, గోనగన్నారెడ్డి తో పాటు అతడి తమ్ముడైన విఠలారెడ్డిని   విద్యలు నేర్చుకోడానికి  ఓరుగల్లుకు పంపించిన లకుమయ రెడ్డి తర్వాత తానే రాజుగా వర్థమానపురాన్ని పాలిస్తుంటాడు.

తమను పాలించేది రుద్రదేవుడు కాదు రుద్రమదేవి అని తెలిసిన తర్వాత సామంత రాజులను చేరదీసి… కాకతీయ సామ్రాజ్యంపై తిరుగుబాటుకు పూనుకుంటాడు లకుమయ రెడ్డి…అయితే అప్పటికే  శివభక్తలు  వేషం వేసుకున్న గోనగన్నారెడ్డి సేన లకుమయ రెడ్డి సైన్యంతో కలిసి వారికే తెలియకుండా అన్నంలో మత్తుమందు కలిపి వారిని బంధీలుగా పట్టుకుంటారు. మహాదేవునితో యుద్దం తర్వాత మళ్ళీ వర్థమానపురానికి గోనగన్నారెడ్డి రాజు అవుతాడు.

Watch Video:

Comments

comments

Share this post

scroll to top