మెరిసిన తార‌లు – కాసుల గ‌ల‌గ‌ల‌లు

టాలీవుడ్‌లో తారలు త‌ళుక్కుమ‌న్నారు. త‌మ అంద‌చందాల‌తో.అద్భుతంగా న‌టించారు. అభిమానుల మ‌న‌సు దోచుకున్నారు. ప్రాంతాలు వేరైనా ఎంద‌రినో తెలుగు సినిమా రంగం అక్కున చేర్చుకుంది. ఒక్కొక్క హీరోయిన్ ఒక్కో స్ట‌యిల్‌ను మెయింటెయిన్ చేస్తూ కాసులు కొల్ల‌గొట్టారు. హీరోయిన్స్ ఎంద‌రో ప‌రిచ‌యం అయ్యారు. మ‌రికొంద‌రు త‌మదైన మార్క్‌తో సినిమాల‌కు ప్రాణం పోశారు. ప్రేమ‌, రొమాన్స్, క్లైమాక్స్ ఆక‌ట్టుకునేలా.ఆలోచించేలా డైరెక్ట‌ర్లు టార్గెట్ చేశారు. న్యూ టాలెంట్ తో ప్రేక్ష‌కుల హృద‌యాలు ప్రేమకే ఓటు వేశాయి.

జ‌యాప‌జ‌యాలు ప‌క్క‌న పెడితే ఈసారి ప్ర‌తిభ‌.అభిన‌యం.న‌ట‌న‌లో ప్ర‌త్యేక‌త‌కే పెద్ద‌పీట వేయ‌డంతో హీరోయిన్లు వాటికే ప్ర‌యారిటీ ఇచ్చారు. మొత్తంగా చూస్తే ఈ ఏడాది హీరో, హీరోయిన్ల‌ది కాదు.డైరెక్ట‌ర్ల‌దేన‌ని చెప్పాలి. కొత్త తార‌ల త‌ళుకుబెళుకుల‌తో వెండి తెర వెలిగి పోయింది. వంద‌కు పైగా సినిమాలు విడుద‌లైనా వాటిలో కొన్ని మాత్ర‌మే విజ‌య‌వంత‌మ‌య్యాయి. ఈసారి విడుద‌లైన తెలుగు మూవీస్‌ల‌లో ఆక‌ట్టుకున్న న‌టిమ‌ణి ఎవ‌రంటే ర‌ష్మికా మంద‌న్న‌. క‌న్న‌డ‌లో కిర‌క్ పార్టీలో న‌టించిన‌ప్పుడే ఇక్క‌డి వారికి ప‌రిచ‌య‌మైంది. ఆమెను న‌టింప చేసేందుకు ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌లేదు. నాగ‌శౌర్య క‌థానాయ‌కుడిగా చ‌లో సినిమాలో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట‌రైంది. మొద‌టి చిత్రంతోనే స‌క్సెస్ మూట‌గ‌ట్టుకుంది రష్మిక. ప‌ర‌శురాం డైరెక్ష‌న్‌లో వ‌చ్చిన గీత గోవిందంలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను డామినేట్ చేసింది.

పాత్ర కూడా అలాంటిదే. 100 కోట్ల మార్క్‌ను ఎప్పుడో దాటేసింది. ఇదో రికార్డు. టాలీవుడ్ వ‌ర్గాలు నివ్వెర పోయేలా చేసింది ఈ మూవీ. ఇపుడు మంద‌న్న‌.టాప్ వ‌న్ హీరోయిన్. భార‌త మాజీ క్రికెట్ కెప్టెన్ ఎం.ఎస్. ధోనీ సినిమాలో అద్భుత‌మైన న‌ట‌న‌ను ప్ర‌ద‌ర్శించి మెప్పించిన కైరా అద్వాణి టాలీవుడ్‌లో త‌ళుక్కున మెరిసింది. ప్రిన్స్ మ‌హేష్ బాబుతో కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన భ‌ర‌త్ అనే నేను సినిమాలో హీరోయిన్‌గా న‌టించి.మెప్పించింది. ఆ సినిమా షూటింగ్ స‌మ‌యంలోనే బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్ హీరోగా తెర‌కెక్కిన విన‌య విధేయ రామ మూవీలో న‌టించేందుకు ఛాన్స్ కొట్టేసింది. మ‌రో తెలుగు మూవీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. ఇంకొంద‌రు అందాల‌ను ఆర‌బోశారు. కుర్ర కారును చ‌క్కిలిగింత‌లు పెట్టారు. ముద్దుల‌తో అల‌రించారు. పాయ‌ల్ రాజ్ పుత్ , శోభిత ఆక‌ట్టుకున్నారు. ఆర్ ఎక్స్ 100 సినిమాతో పంజాబ్‌కు చెందిన పాయ‌ల్ రాజ్ న‌టించింది. గూఢ‌చారి మూవీలో శోభిత న‌టించింది. ముద్దు స‌న్నివేశాల్లో ప‌రిధి దాటేసింది.

క‌న్న‌డ భామ స‌భా న‌టేష్ న‌న్ను దోచుకుందువ‌తేలో న‌టించింది. ప్రియాంక జువాల్క‌ర్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో క‌లిసి టాక్సీవాలా మూవీలో న‌టించింది. స‌వ్య‌సాచిలో న‌వ్య అగ‌ర్వాల్ న‌టించి మెప్పించింది. చెలియాలో తెలుగు అమ్మాయి ఆదితిరావు హైద‌రీ ఆక‌ట్టుకుంది. స‌మ్మోహ‌నంలో , అంత‌రిక్షంలోను క‌థానాయ‌కిగా న‌టించింది. ర‌వితేజ న‌టించిన నేల‌టికెట్ లో మాళ‌విక శ‌ర్మ‌, నాగార్జున ఆఫీస‌ర్‌తో శ‌రీన్, పూరి జ‌గ‌న్నాథ్ మెహ‌బూబాలో నేహా శెట్టి ప‌రిచ‌యం అయినా ఆక‌ట్టు కోలేక పోయారు.

సినిమాలు ఆడ‌క పోయినా మురిపించి మెరిపించారు ఈ ముద్దుగుమ్మ‌లు. అందాలు.న‌వ్వులు.ముద్దులు.ఆవేశ‌కావేశాల‌తో .అభిన‌యంతో మెప్పించారు. నిర్మాత‌ల‌కు కాసులు కురిపించారు. తెలుగు సినిమాలో కంటెంట్ ఉన్న వాటినే ఆద‌రించినా కొన్ని సినిమాలు మ‌రీ శృతి మించ‌డంపై కొంత అభ్యంత‌రం వ్య‌క్త‌మ‌వుతోంది.

Comments

comments

Share this post

scroll to top