పుష్కర స్నానం ఇలా చేస్తేనే పుణ్యం.

పవిత్ర గోదావరి పుష్కరాలు వచ్చేశాయ్.. ఎనిమిది లక్షల మందికి పైగా ఈ పుష్కరాల్లో  పవిత్ర స్నానాలు ఆచరిస్తారనే అంచన. ఇంత పెద్ద ఉత్సవం లో కొన్ని వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. పవిత్ర పుష్కరాల్లో స్నానాలు ఆచరించే భక్తులారా ఓసారి ఆలోచిద్దాం! పుణ్యం పేరుతో మనం ఏ పాపాన్ని చేయకుండా, గోదారమ్మ పవిత్రతకు భంగం కలగకుండా, ప్రకృతి తల్లికి మేలు జరిగేలా మనం కొన్ని పనులను చేద్దాం.

godavari pushkaralu

ఇవి చేద్దాం:

 • మూడు సార్లు నదిలో నుంచీ మట్టిని తీసి ఒడ్డు మీద వేసి అప్పుడు స్నానం చేయాలి. నదులు చెరువులలో స్నానం చేసే ముందు ఈ విధంగా చేయడం వలన ప్రత్యేకంగా పూడిక తీత పనులు చేయాల్సిన అవసరం రాదు. ఇది ప్రాచీన రుషులు చెప్పిన స్నానవిధి.
 • ఉదయాన్నే పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి స్నానం చేయాలి.
 • ఆధునిక స్విమ్మింగ్ పూల్స్ లో ఏ విధమైన నియమాలను పాటిస్తామో వాటిని పుష్కర ఘాట్లలో కూడా పాటిద్దాం.
 • శాస్త్రం సూచించిన ఈ నియమాలను పాటిస్తూ పవిత్ర స్నానాలు చేసినప్పుడు మాత్రమే పుణ్య ఫలాలు లభిస్తాయి.
 • దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న వారు తమవెంట మందులను తీసుకెళ్లండి.
 • చిన్న పిల్లలను జాగ్రత్తగా ఓ కంట కనిపెడుతుండండి.

ఇవి చెయ్యొద్దు:

 •  నదీ స్నానం చేసేటప్పుడు  షాంపూ, సబ్బు వంటివి వాడరాదు. నూనె రాసుకోవడం, నలుగు పెట్టుకోవడం కూడా నిషేధం.
 •  రాత్రి ధరించిన వస్త్రాలతో స్నానం చేయకూడదు.
 • స్నానం చేసిన తరువాత వస్త్రాలను నదిలో ఉతకడంగానీ … పిండటంగాని చేయకూడదు. బట్టల సబ్బు అసలు వాడరాదు.
 •  అలాగే స్నానం చేసే సమయంలో ఉమ్మి వేయడం వంటివి చేయకూడదు.
 • పళ్లు తోముకోవడం, కాలకృత్యములు తీర్చు కోవడం వంటివి నదీ ప్రాంతాలలో చేయరాదు. నదులలో గుప్తప్రదేశాలు శుభ్రం చేసుకోరాదు.

వీటిని పాటించి నిజమైన పుణ్యాన్ని దక్కించుకునే ప్రయత్నం చేయండి!  ఆ గోదారమ్మ మనకు చల్లని దీవెనను ప్రసాదిస్తుంది. పుష్కరాలు భారతదేశంలో ఓ పవిత్ర ఘట్టం, 12 సంవత్సరాలకు ఒకసారి బృహస్పతి ఏ రాశిలో ప్రవేశిస్తుందో, అప్పుడు ఆ నదికి పుష్కరాలు వస్తాయి. ఇప్పుడు బృహస్పతి సింహరాశిలో ప్రవేశించింది కాబట్టి గోదావరికి పుష్కరాలు వచ్చాయి.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top