ఎమర్జెన్సీ ఉన్న పట్టించుకోకుండా ఆపరేషన్ థియేటర్ లో ఇద్దరు డాక్టర్స్ గొడవ పడి ఒక పసిప్రాణం తీశారు!

రాజస్థాన్ జోధ్ పూర్ లోని ఉమైద్ ఆస్పత్రిలో దారుణం జరిగింది. ఆపరేషన్ థియేటర్ లోనే ఇద్దరు డాక్టర్లు గొడవపెట్టుకున్నారు. నిండు గర్భిణికి ఆపరేషన్ చేస్తున్న టైంలో ఇద్దరు డాక్టర్లకు మధ్య వివాదం తలెత్తింది. మాటా మాటా పెరిగి ఆపరేషన్ ను మధ్యలోనే ఆపేశారు వైద్యులు. ధియేటర్ లోనే ఘర్షణకు దిగారు. పక్కనే ఉన్న సిబ్బంది వారించినా పట్టించుకోలేదు. ఒకరినొకరు తిట్టుకున్నారు. ఈ తతంగాన్ని అంతా వీడియో తీసిన సిబ్బంది నెట్ లో పెట్టారు. ఆపరేషన్ మధ్యలోనే నిలిచిపోవడంతో.. ఈ లోకాన్ని చూడకుండానే పసిగుడ్డు ప్రాణాలు వదిలింది. ఆపరేషన్ ధియేటర్ లో డాక్టర్ల గొడవ వీడియో వైరల్ కావటంతో చర్యలకు ఆదేశించింది రాజస్థాన్ ప్రభుత్వం.

జోధ్ పూర్ పట్టణంలోని ఉమైద్ ఆస్పత్రిలో డాక్టర్ల గొడవ పై కమిటీ వేశారు సూపరింటెండెంట్. గొడవకు దిగిన డాక్టర్లను సస్పెండ్ చేశారు. కమిటీ రిపోర్ట్ రాగానే మరిన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఆపరేషన్ థియేటర్లో డాక్టర్ల గొడవపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

watch video here:

ప్రాణం పోయాల్సిన డాక్టర్లు.. ఓ చిన్నారి ప్రాణం తీశారు కదా అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. ఎక్కడ ఎలా ఉండాలో కూడా డాక్టర్లు మనం చెప్పాలా.. వాళ్లకు ఆ జ్ణానం లేదా అంటూ తిట్టిపోస్తున్నారు. పోయిన ఆ చిన్నారి ప్రాణాన్ని తీసుకు రాగలరా అని ప్రశ్నిస్తున్నారు.

Comments

comments

Share this post

scroll to top