ఏవరికైనా గిప్ట్స్ ఇవ్వాలనుకుంటే…ఈ 6 వస్తువుల్లో ఏదో ఒకటి ఇవ్వండి. మీకు బాగా కలిసి వస్తుంది.

బ‌హుమ‌తులు అందుకోవ‌డం అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండ‌దు చెప్పండి. స్నేహితుడు, కుటుంబ స‌భ్యులు, తెలిసిన వారు ఎవ‌రైనా బ‌హుమ‌తులు ఇస్తే వాటిని అందుకునే వారు ఆయా బ‌హుమ‌తుల‌ను ఎంతో మురిపెంగా చూసుకుంటారు. సాధార‌ణంగా మ‌న ద‌గ్గ‌ర బ‌హుమ‌తులు ఇవ్వ‌డం అనేది కేవ‌లం శుభ కార్యాల‌ప్పుడు, పుట్టిన రోజులు వంటి ప్ర‌త్యేక సంద‌ర్భాల్లో మాత్ర‌మే జ‌రుగుతుంది. అయితే ట్రెండ్ మారింది క‌దా. ఈ మ‌ధ్య కాలంలో న్యూ ఇయ‌ర్‌కి కూడా గిఫ్ట్‌లు పంపుకోవ‌డం మొద‌లు పెట్టారు. ఈ క్ర‌మంలో గిఫ్ట్ ఏది వ‌చ్చినా, లేదా ఎవ‌రికైనా కొనిచ్చినా వీటి గురించి ముందుగా తెలుసుకోండి. ఎందుకంటే… ఇప్పుడ మేం చెప్పబోయేది కూడా గిఫ్ట్‌ల గురించే. కాక‌పోతే జ్యోతిష్య శాస్త్రం, వాస్తు ప‌రంగా ఈ గిఫ్ట్‌ల‌ను ఇచ్చినా, తీసుకున్నా దాంతో ఎవ‌రికైనా ల‌క్ క‌ల‌సి వ‌స్తుంద‌ట‌. అవును, మీరు విన్న‌ది క‌రెక్టే. అయితే మ‌న‌కు ల‌క్‌ను తెచ్చిపెట్టే ఆ గిఫ్ట్‌లు ఏమిటో వాటిపై ఓ లుక్కేద్దామా..!

gifts-for-luck
ఏనుగు బొమ్మ‌లు…
ఏనుగు బొమ్మ‌ల‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన వారికి, వాటిని తీసుకున్న వారికి ల‌క్ బాగా క‌ల‌సి వ‌స్తుంద‌ట‌. వారు అనుకున్న‌వి నెర‌వేరుతాయ‌ట‌. అయితే వెండి, బంగారం వంటి ఖ‌రీదైన లోహాల‌తో చేసిన ఏనుగు బొమ్మ‌ల‌ను కొన‌లేని వారు చెక్క‌, ఇత్తడి, రాగి వంటి లోహాల‌తో చేసిన బొమ్మ‌ల‌ను కూడా గిఫ్ట్‌గా ఇవ్వ‌వ‌చ్చు.

మ‌ట్టి పాత్ర‌లు…
మ‌ట్టితో చేసిన రంగు రంగుల పాత్ర‌ల‌ను గిఫ్ట్‌గా ఇచ్చినా, తీసుకున్నా దాంతో జీవితంలో అంతా శుభ‌మే జ‌రుగుతుంద‌ట‌. ధ‌నం బాగా ల‌భిస్తుంద‌ట‌. మ‌ట్టిలో ఉండే భూమి అనే అంశం మ‌న‌కు జీవితంలో ఎదుర‌య్యే క‌ష్టాల‌ను తొల‌గిస్తుంద‌ట‌.

పియోనీ పూలు…
పియోనీస్ (Peonies) అని పిల‌వ‌బ‌డే ఓ ర‌కం పూల‌ను గిఫ్ట్‌గా ఇచ్చినా లేదంటే తీసుకున్నా దాంతో ఆ ఇంట్లో ఎల్ల‌ప్పుడూ ప్ర‌శాంత‌త ఉంటుంద‌ట‌. సంప‌ద స్థిరంగా వృద్ధి చెందుతూ ఉంటుంద‌ట‌. ధ‌నం బాగా సంపాదిస్తార‌ట‌.

వెండి నాణేలు లేదా పాత్ర‌లు…
పురాణాల ప్ర‌కారం వెండి అంటే ల‌క్ష్మీదేవికి ఎంత‌గానో ఇష్ట‌మ‌ట‌. దీంతో వెండి నాణేలు లేదా పాత్ర‌ల‌ను బ‌హుమ‌తి రూపంలో ఇచ్చినా లేదా తీసుకున్నా దాంతో సంప‌ద వృద్ధి చెందుతుంద‌ట‌. అలాంటి వారికి ల‌క్ష్మీ దేవి క‌టాక్షం ఎల్ల‌ప్పుడూ ఉంటుంద‌ట‌.

గుర్రాల పెయింటింగ్‌…
ఏడు తెల్ల‌ని గుర్రాలు ప‌రిగెడుతున్న‌ట్టుగా ఉండే పెయింటింగ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చినా లేదా తీసుకున్నా దాంతో ఆ వ్య‌క్తులు త‌మ త‌మ రంగాల్లో అద్భుతంగా రాణిస్తార‌ట‌. ధ‌నం బాగా సంపాదిస్తార‌ట‌. ఫెంగ్ షుయ్ వాస్తు ఈ విష‌యాన్ని చెబుతోంది.

దుస్తులు…
ఇక చివ‌రిగా దుస్తులు. వీటిని బ‌హుమ‌తి రూపంలో పొందినా లేదంటే ఎవ‌రికైనా ఇచ్చినా దాంతో ఎల్ల‌ప్పుడూ మంచే జ‌రుగుతుంద‌ట‌. అయితే న‌లుపు రంగు దుస్తుల‌ను మాత్రం ఇవ్వ‌కూడ‌ద‌ట‌. వేరే ఏ ఇత‌ర రంగు అయినా ఫ‌ర్వాలేదు. నిర‌భ్యంత‌రంగా గిఫ్ట్ రూపంలో ఇవ్వ‌వ‌చ్చు.

Comments

comments

Share this post

scroll to top