అబ్బాయిలు బ్లూటూత్లు, అమ్మాయిలు వైఫైలు..ఇంకా చాలానే చెప్పారు ఈ గ్యాంగ్..

గర్ల్స్ ఇంతే. బాయ్స్ అంతే అంటూ… యూత్  లోని కొత్త యాంగిల్ ను బయటపెట్టారు ఈ క్రియేటివ్ టీమ్. పాత్రల పరిచయం నుండే ఓ ఢిపరెంట్ స్ట్రాటజీ ని మెయింటేన్ చేస్తూ నవ్విస్తూ, ఆలోచించేలా చేశారు. పాత్ర పాత్ర కి ప్రాసతో కూడిన పంచులు మాత్రం త్రివిక్రమ్ డైలాగ్స్ లా పేల్చారు . బేసిక్ గా యూత్ ఏయే టైప్స్  లో ఉంటారో 20 నిమిషాల వీడియోలో డెమో చూపించారు ఈ క్రియేటివ్ టీమ్ ప్రొడక్షన్ సభ్యులు. షార్ట్ ఫిల్మ్ ను చాలా స్మార్ట్ గా తీసిన బృందానికి అభినందనలు.

ఈ షార్ట్ ఫిల్మ్ లో ఫన్నీ డైలాగ్స్ ( పెటెంట్ తీసుకోండి బాస్..లేకపోతే సినిమాలో ఫ్రీగా వాడేసుకుంటారు.)

  • అబ్బాయ్ లు బ్లూటూత్ లాంటి వాళ్లు, అమ్మాయిలు వైఫై లాంటి వాళ్లు.
  • ఒక్క మగాడు కూడా రాముడిలా ఉండడు కానీ వచ్చే వైఫ్ మాత్రం సీతలా ఉండాలంటారు.
  • అమ్మాయిలకు కావాల్సింది మా పాకెట్ వెనుక ఉన్న మనస్సు కాదు అందులో ఉన్న పర్సు
  • ఎడారిలో ఇసుక మూటలమ్ముకునే వారు అబ్బాయిలు.
  • ప్లేన్ లో సీట్ కోసం కర్చీఫ్ వేసే పిచ్చి సన్నాసులు అబ్బాయిలు.
  • వాష్ బేసిన్ లో చాపలు పట్టుకునే చపాతీ మొహాలు అమ్మాయిలు
  • AC కోసం ATM కు వెళ్లి బ్యాలెన్స్ చెక్ చేసుకునే కకృత్తి వెధవలు అబ్బాయిలు.
  • బయట వర్షం పడుతుంటే ఇంట్లో గొడుగులు వేసుకొని తిరిగే తింగరోళ్లు అమ్మాయిలు

ఈ డైలాగ్స్ ఎవ్వరినీ ఉద్దేశించినవి కావు, కేవలం నవ్వించడానికి వాళ్లు ఆ షార్ట్ ఫిల్మ్ లో వాడారు, మిమ్మల్ని నవ్వించడానికి నేను ఇక్కడ వాడాను.. అయినా ఇది జబర్థస్త్ ఖతర్నాక్ కామెడీ షో లో వాడే నాన్ వెజ్ మాటలు కాదు కదా..  నవ్వుకోండి.. షార్ట్ ఫిల్మ్ ను మాత్రం అభినందించండి.  షార్ట్ ఫిల్మ్ లెంగ్త్ తగ్గిస్తే బాగుండేది అని నా అభిప్రాయం.

Watch Short Film Here:

CLICK: ప్రపంచ కప్ గెలిచినా పూటగడవని పరిస్థితి.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top