లవర్ కి పంపబోయి “ఐ లవ్ యు” అని వేరే వ్యక్తికి వాట్సాప్‌లో మెసేజ్ చేసింది…తెలివిగా ఎలా కవర్ చేసుకుందో తెలుసా.?

”ఆ రోజు నేను, అత‌ను క్లాస్‌ల‌కు బంక్ కొట్టేశాం. లంచ్ త‌రువాత కాలేజీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాం. అత‌ను ల్యాప్‌టాప్ తెచ్చాడు. అందులో ఇద్ద‌రం క‌లిసి ఒక సినిమా చూశాం. చాలా హ్యాపీ ఫీలింగ్ క‌లిగింది. వెంట‌నే ప‌క్క‌నే ఉన్న రెస్టారెంట్‌కు వెళ్లి డిన్న‌ర్ చేశాం. ఆ రోజు అలా స‌ర‌దాగా గ‌డిపాం. ఎంతో బాగా అనిపించింది నాకు. నిజంగా అంత‌టి రొమాంటిక్ డే ఎప్పుడూ నాకు ఎదురు కాలేదు. అదొక మ‌ధుర‌మైన అనుభూతిగా నాకు మిగిలింది.

ఆ త‌రువాత ఇంటికి వెళ్లా. ఆ రోజు జ‌రిగిన విశేషాల‌ను మ‌రోసారి త‌లుచుకుంటూ అత‌నికి మెసేజ్ చేస్తున్నా. నేను అత‌నికి ఎప్పుడూ హైక్ మెసెంజ‌ర్‌లో మెసేజ్‌లు పెడ‌తా. కానీ ఈ సారి ఎందుకో వాట్సాప్ వాడాల‌నిపించింది. వెంట‌నే వాట్సాప్ ఓపెన్ చేశా. అందులో అత‌ని కాంటాక్ట్ వెదికా. దొరికింది. కాంటాక్ట్ ఓపెన్ చేసి.. అత‌నికి మెసేజ్ పెట్టా. “I’m really happy to have you. You’re such a wonderful person. You make me smile everyday and today you made my day special. I love you.” అంటూ అత‌నికి మెసేజ్ పెట్టా. వెంట‌నే షాక్ తిన్నా.

అస‌లు ఆ కాంటాక్ట్ అతనిది కాదు. మా ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన వేరే అమ్మాయిది. దీంతో నాకు ఒక్క‌సారిగా ఒళ్లు జ‌ల‌ద‌రించింది. ఏం చేయాలో అర్థం కాలేదు. నేను అనుకున్న వ్య‌క్తికి కాకుండా వేరే వ్య‌క్తికి ఆ మెసేజ్ వెళ్లింద‌ని తెలిసి కంగారు ప‌డ్డా. ఆమె గ‌న‌క ఈ విష‌యం ఇంట్లో చెబితే.. అప్పుడు నా ప‌రిస్థితి ఏంటా.. అని ఆలోచించా. వెంట‌నే ఓ ఆలోచ‌న వ‌చ్చింది. మళ్లీ అదే కాంటాక్ట్‌కు మెసేజ్ పెట్టా. “Today is Bestie Day!.. Send this to 10 of your best friends and see how much you get in return. If you get more than 5,it means you’re lucky.. Pls keep the chain going!.” అంటూ మెసేజ్ పెట్టా. దీంతో అవ‌త‌లి నుంచి రిప్లై వ‌చ్చింది. అదే మెసేజ్‌ను మ‌ళ్లీ ఆమె నాకు ఫార్వార్డ్ చేసింది. అప్పుడే అనుకున్నా… ఇదేదో వైర‌ల్ మెసేజ్ అనుకుని ఆమె నాకు మ‌ళ్లీ అదే మెసేజ్‌ను ఫార్వార్డ్ చేసిందని. దీంతో ఊపిరి పీల్చుకున్నా. ఆ సంఘ‌ట‌న త‌లుచుకుంటేనే ఇప్ప‌టికీ నాకు అదోలా అనిపిస్తుంది..!”

Comments

comments

Share this post

scroll to top