ఆ అమ్మాయి సహాయం కోరుతూ ఏకంగా “ప్రధాని మోడీ” కి లేఖ రాసింది! మోడీ గారు ఎలా స్పందించారో చూడండి!

మనం విద్యాసంస్థల్లో ప్రధానోపాధ్యాయుడికి లేఖ రాయడమే అరుదు. ఇక దానికి వారు స్పందిస్తాడు అనుకోవడం గాల్లో మెడలు కట్టడం లాంటిది. కానీ ఓ ఎం.బి.ఏ చదివే విద్యార్థిని మాత్రం ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికే లేఖ రాసింది. అందరిలాగే మోడీ గారు కూడా స్పందించారు. ఒకవేళ స్పందించిన అది ఎన్నో రోజుల తరవాత నాకు మేలు జరుగుతుంది అని అందరు అనుకున్నట్టే ఆ అమ్మాయి కూడా అనుకుంది. కానీ ఇక్కడ మోడీ గారు అందరిని ఆశ్చర్య ఆనందాలకు గురి చేసారు!

ఆమె పేరు “సారా”. కర్ణాటకకు చెందిన ఈ ముస్లిం యువతికి పైచదువులు చదవాలన్నది కోరిక. ఎం. బి. ఏ చదువుదామని బ్యాంకుల చుట్టూ లోన్ కోసం తిరిగితే “సారా” కు ఎలాంటి భరోసా లభించలేదు.తీసుకున్న రుణం తీర్చగలదన్న నమ్మకం కుదరకపోవడం, అందుకు తగిన ఆధారాలను కూడా ఇవ్వలేకపోవడంతో అధికారులు ముఖం చాటేశారు. కారణం ఆమె తండ్రి షుగర్ ఫ్యాక్టరీ లో పని చేసే రోజు కూలి. అతను లోన్ తీర్చలేదు అని అధికారులు నమ్మి “సారా” కు లోన్ ఇవ్వలేదు. దీంతో విసిగి వేసారిన ఆమె.. ఉన్నత చదువులకు సాయం చేయాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసింది. అంతే… ఆమె ఊహించని రీతిగా దేశంలోని అత్యున్నత నాయకుడి నుంచి సమాధానం వచ్చింది.


ప్రధాని మోడీ గారు ఆ అమ్మాయికి పది రోజుల్లోగా లక్షన్నర రూపాయలు లోన్ ఇవ్వాలని “కర్ణాటక” చీఫ్ సెక్రటరీ కి లేఖ రాసారు. కేవలం ఒక్కరోజులోనే ఆమెకు మాండ్యలోని విజయ బ్యాంకు నుంచి ఆర్ధిక సాయం అందింది. దీంతో సారా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ… ‘‘ప్రధానమంత్రి గారి దగ్గర్నుంచి తప్పకుండా సమాధానం వస్తుందని నేను ఆశించాను. అయితే ఇంత త్వరగా వస్తుందనుకోలేదు. కేవలం పదిరోజుల్లోనే నాకు రిప్లై వచ్చింది’’ అని వెల్లడించింది.

Comments

comments

Share this post

scroll to top