ఆమె నడిరోడ్డుపై బట్టలు విప్పింది…ఇందులో అశ్లీలం లేదు…అర్థం ఉంది.!

ఆమె పేరు జే వెస్ట్ … లండన్ లో ఉంటుంది. ఆమె  సడెన్ గా ఓ జంక్షన్ దగ్గర తాను వేసుకున్న బట్టలను తీసేసి..లో దుస్తువులతో నిల్చుంది. అందరూ ఆశ్చర్యపోయారు..! కానీ ఆమె అలా నిల్చుని కింద ఒక బోర్డు మీద ఏదో రాసి పెట్టింది. దానిని చదివాకా… చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా  ఒకొక్కరు ఆమె దగ్గరకు వెళ్లి , ఆమె శరీరం పై  పెన్ తో లవ్ సింబల్స్ రాశారు.
ఆశ్చర్యంగా ఉందా..? ఆమె అలా చేసింది ఎందుకో తెలుసా? ఆ యువతి ఒకప్పుడు ఈటింగ్ డిజార్డర్(తీవ్రంగా ఆకలి వేయడం కానీ, అసలు ఆకలి లేకపోవడం)  బాధితురాలు. అయితే ఇప్పుడు ఆ సమస్య నుంచి బయటపడింది.  ఈటింగ్ డిజార్డర్‌తో బాధపడుతున్న వారికోసమే తను ఇలా నిలుచున్నానని, అలాంటి వారికి అండగా ఉండాలనుకునేవారు తన శరీరంపై లవ్ సింబల్‌ను రాయాలని తన పక్కన ఉన్న బోర్డ్ మీద రాసిపెట్టింది..

మద్దతును కూడగట్టడం అనేక  రకాలుగా ఉంటుంది కానీ…ఈమె ఈ మార్గాన్ని ఎంచుకుంది. వే ఏదైనా  ఎక్కువగా రీచ్ ఉండాలనుకుంది..దాంట్లో సక్సెస్ అయ్యింది  ఈ లండన్ పాప . ఇప్పుడు ఈ వీడియో యూబ్యూబ్ లో హల్ చల్ చేస్తోంది. ఇప్పటికే    ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఆ వీడియోని చూసి, ఈటింగ్ డిజార్డర్ బాధితులకు అండగా ఉంటామని కామెంట్లు రాసి, లైక్‌లు కొడుతున్నారు. దీంతో సదరు మహిళ చాలా సంతోషాన్ని వ్యక్తం చేసింది. తన ప్రయత్నం విజయవంతం అయ్యిందని చెబుతోంది.

 WATCH VIDEO HERE:

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top