ప్రభాస్ ని చెంప దెబ్బ కొట్టిన అమ్మాయి… తర్వాత ఏం జరిగింది అంటే.?

రెబెల్ స్టార్ ప్రభాస్ అంటే చాలా మందికి ఇష్టం, కానీ ప్రభాస్ ని అందరూ డార్లింగ్ అనే పిలుస్తారు, ఎందుకంటే ప్రభాస్ చాలా మంచి మనిషి, అందరితోనూ మంచిగా మాట్లాడుతాడు, ఈ విషయాలు అందరికి తెలుసు, అభిమానులను ఎంతగానో గౌరవిస్తాడు ప్రభాస్. బాహుబలి సినిమా తరువాత ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షలమంది ప్రభాస్ కి అభిమానులయ్యారు. నార్త్ ఇండియా, తమిళ్ నాడు, కేరళ, కర్ణాటక లో ప్రభాస్ క్రేజ్ బీభత్సంగా పెరిగిపోయింది. జపాన్, చైనా, జర్మనీ వంటి దేశాల్లో వీరాభిమానులు ఎక్కువయ్యారు ప్రభాస్ కి. ముఖ్యంగా జపాన్ లో రజినీకాంత్ గారి తరువాత అత్యంత ఆదరణ పొందిన ఇండియన్ యాక్టర్ గా ప్రభాస్ పేరు తెచ్చుకున్నాడు.

చెంప గిల్లింది.. :

సాహో చిత్ర షూటింగ్ లో లో ప్రభాస్ బిజీ బిజీ గా ఉన్నాడు, సాహో చిత్రం కోసం తెలుగు ప్రేక్షకులే కాదు, ఇండియా లోని మూవీ లవర్స్ అంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. శ్రద్ధా కపూర్ బర్త్ డే సందర్భంగా సాహో మూవీ మేకింగ్ వీడియో 2 ని రిలీజ్ చేసారు మూవీ యూనిట్.

ప్రభాస్ ని విమానాశ్రయం లో ఒక ఇండియన్ అమ్మాయి గుర్తు పట్టింది, ప్రభాస్ ని చూడగానే ఆనందం తట్టుకోలేకపోయింది, వెంటనే ప్రభాస్ దెగ్గరకు వెళ్లి ఒక ఫోటో అని అడిగింది. ఆ అమ్మాయి అంత అభిమానం తో అడుగుతుండటం తో ప్రభాస్ కాదనలేక ఫొటోకు అంగీకరించాడు. ఫోటో కు ఫోజ్ ఇస్తున్నంత సేపు ఆ అమ్మాయి నవ్వుతూనే ఉంది, ఆనందంలో మునిగితేలింది ఆ అమ్మాయి, ఫోటో పూర్తయ్యాక ప్రభాస్ పక్కన నిలబడి సంతోషంతో గంతులేసింది, కేవలం గంతులెయ్యడంతో ఆపెయ్యలేదు. వెళుతూ వెళుతూ ప్రభాస్ చెంప పై టచ్ చేసి వెళ్ళింది. అయినా కూడా ప్రభాస్ చిరునవ్వు తోనే ఉన్నాడు. ఆ అమ్మాయి పక్కనే ఉన్న ఇంకొకతను ప్రభాస్ తో ఫోటో దిగాడు.

వైరల్ వైరల్… :

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం వైరల్ అయ్యింది. ఆ అమ్మాయి ఇండియా వైడ్ గ పాపులర్ అయిపోయింది. అయితే ఈ వీడియో చూసిన అందరూ ప్రభాస్ ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఆ అమ్మాయి అంత గోల చేసినా ప్రభాస్ నవ్వుతూనే ఉన్నాడు, అందుకే అతన్ని అందరూ డార్లింగ్ అంటారు.

Instagram:

Comments

comments

Share this post

scroll to top