ప్రేమించిన యువ‌కుడికి రెండు కాళ్లు పోయినా ఆమె అత‌న్ని పెళ్లి చేసుకుంది. అస‌లైన ప్రేమ‌కు అర్థం చెప్పింది.!!

నిజమైన ప్రేమ అంటే అంతే… అందుకు ఏవీ అడ్డు కావు.. కుల‌మ‌తాలు, వ‌ర్ణ భేదాలు, పేద‌, ధనిక తేడాలే కాదు.. శారీర‌క సౌంద‌ర్యం కూడా అడ్డు కాదు. ప్రేమించే మ‌న‌స్సు ఉండాలే కానీ ఎదుటి వ్య‌క్తి ఎలా ఉన్నా న‌చ్చుతారు. అవును.. క‌రెక్టే.. అందుకే ఆ యువ‌తి తాను ప్రేమించిన యువ‌కుడికి రెండు కాళ్లు పోయి అంగ వైక‌ల్యం వ‌చ్చినా అత‌న్నే గాఢంగా ప్రేమించింది క‌నుక అత‌న్నే పెళ్లి చేసుకుంది. త‌ల్లిదండ్రులు వ‌ద్ద‌ని చెప్పినా వారికి స‌ర్ది చెప్పి మ‌రీ ఆ యువ‌కున్ని వివాహం చేసుకుంది. నిజ‌మైన ప్రేమకు ఆమె నిర్వ‌చ‌నం చెప్పింది.

తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు జిల్లా వాణియంబాడి కొనమేడుకు చెందిన విజయ్, నీలగిరి జిల్లా ఊటీకి చెందిన శిల్ప‌లు ప్రేమించుకున్నారు. వీరిద్దరూ కోయంబత్తూరులోని ఒకే కాలేజీలో చదివే సమయంలో ఒకరినొకరు ప్రేమించుకొన్నారు. అయితే విజయ్ ఉద్యోగం కోసం బెంగుళూరుకు రైలులో వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకొంది. రైలు నుండి ప్రమాదవశాత్తు విజయ్ కిందపడిపోయాడు. దీంతో అతనికి రెండు కాళ్ళను తొలగించారు వైద్యులు. ఆసుపత్రిలోనే విజయ్ చికిత్స పొందుతున్నాడు.

కాగా వాణియంబాడి ప్రభుత్వాసుపత్రిలో విజయ్ చికిత్స తీసుకుంటున్న విషయం తెలుసుకున్న శిల్ప‌ ఆసుపత్రికి వెళ్ళింది. విజయ్ ను ఆ పరిస్థితిలో చూసి కలత చెందింది. అనంత‌రం ఆమె స్వగ్రామం వెళ్ళింది. విజయ్ ను పెళ్ళి చేసుకుంటాన‌ని త‌ల్లిదండ్రుల‌కు చెప్పింది. కాళ్లు పోగొట్టుకొన్న విజయ్‌తో వివాహనికి వారు ఒప్పుకోలేదు. కానీ శిల్ప‌ మాత్రం తన పట్టుదలను మాత్రం వదులుకోలేదు. మార్చి 31వ తేదీన ఆసుపత్రికి వచ్చిన శిల్ప‌ ఆసుపత్రిలోని వైద్యుల సమక్షంలో విజయ్‌ను వివాహం చేసుకుంది. ఆమె అత‌న్ని గాఢంగా ప్రేమించింది క‌నుక‌నే అతనికి అంగ వైక‌ల్యం క‌లిగినా చివ‌ర‌కు అత‌న్నే పెళ్లి చేసుకుంది. అసలైన ప్రేమ అంటే అదేన‌ని నిరూపించింది. అందుకు ఆమెను అభినందించాల్సిందే.

 

Comments

comments

Share this post

scroll to top