మా బావ అంటే నాకు ప్రాణం, ఎన్నో తిప్పల తరువాత.!!

నా పేరు ప్రీతీ, మా ఊరు సముద్రం దెగ్గర ఉంటుంది, మా ఊర్లో ఉండేవారందరు చేపలు పడుతూ అదే జీవనాధారంగా బ్రతుకుతుంటారు. మా నాన్న కూడా చేపలు పట్టడానికి రోజు వెళతాడు , మా ఊర్లో ఎవ్వరు పెద్దగా చదువుకోలేదు. అందుకే నేను బాగా చదువుకోవాలనుకున్నా, 10 వ తరగతి పాస్ అయ్యాక ఇంట్లో వాళ్ళను ఒప్పించి ఇంటర్ కాలేజీ లో చేరాను.

ఇంటర్ పూర్తి చేసాక డిగ్రీ కాలేజీ లో జాయిన్ అవ్వాలని ఇంట్లో వాళ్ళని ఒప్పియ్యడానికి చాలా ప్రయత్నించా. కానీ చుట్టు పక్కన ఉండేవాళ్ళు మాత్రం, ఆడపిల్లకు అంత అంత చదువులు ఎందుకు. ఇంటర్ చదవడమే ఎక్కువ. ఇంక ఇంతటితో మానిపించి మంచి సంబంధం చూసి పెళ్లి చేసేయండి అని మా ఇంట్లో వాళ్లకు చెప్పారు, వాళ్ళ పిల్లోళ్లకంటే నేను ఎక్కువ చదువుతాను అని వారికి కుళ్ళు. నేను డిగ్రీ కాలేజీ లో జాయిన్ అవ్వడానికి మా ఇంట్లో అంగీకరించలేదు.

మా బావ :

మా బావ మా ఊర్లోనే చేపలు పడుతుంటాడు, మా బావ అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుండి నేను మా బావ నే ప్రేమించాను. ఈ విషయం మా బావకు చెప్పలేదు. ఇంటర్ కంప్లీట్ చేసాక ఒక రోజు మా బావ కి చెప్పేసాను నిన్ను ప్రేమిస్తున్నా అని, మా బావ కి కూడా నేనంటే ఇష్టమే అని ఆ రోజే తెలిసింది. నేను మా బావ 6 నెలలు ప్రేమించుకున్నాం, ఆ తరువాత వెంటనే పెళ్లి చేసుకోవాలనుకున్నాం. కానీ మా నాన్న ఒప్పుకోలేదు.

నేను చేపలు పట్టి, నువ్వు చేపలు పట్టి, రేపు పొద్దున్న నీ కొడుకులు చేపలు పట్టి :

చేపలు పట్టి బ్రతికే వాడికి నేను నా కూతురిని ఇవ్వ దలుచుకోలేదు, నా లాగే నా మనవాళ్ళు కూడా తిప్పలు పడటం నాకు ఇష్టం లేదని మా నాన్న మా మామయ్య అత్తమ్మ లతో అనడం తో వారు కూడా మౌనంగా ఉండిపోయారు. మా బావ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు,సిటీ లో ఒక మంచి ఉద్యోగం లో జాయిన్ అయ్యి రెండేళ్లలోనే మంచి స్థాయి కి వచ్చాడు. ఈ రెండేళ్లలో ఎన్నో సంబందాలు వచ్చినా, అన్నిటిని కాదన్నాను, ఎన్నో కొట్లాటలు ఇంట్లో ఈ రెండేళ్లలో.

చివరికి ఊరి పెద్దల దయ వల్ల :

ఊర్లోని పెద్దలు మా నాన్న కు నచ్చజెప్పారు. మీ అల్లుడు మంచిగా సంపాదిస్తున్నాడు ఇప్పుడు పట్నం లో, తనకి నీ కూతురిని ఇచ్చి చేస్తే తప్పేంటి, నీ కూతురికి కూడా నీ అల్లుడంటే ప్రాణం కనుక ఇద్దరికి పెళ్లి చేసేయి అని చెప్పారు. చివరికి ఊరి పెద్దల మాట విని నన్ను నా బావ ను ఒకటి చేసారు మా నాన్న. మా పెళ్లి అయి నేటికీ 4 ఏళ్ళు అవుతుంది. మేము చాలా సంతోషంగా ఉన్నాం.

 

Comments

comments

Share this post

scroll to top