హాస్పిటల్ నుంచి రాగానే తమ్ముడిని ఎత్తుకుందామని వెళ్లాను కానీ..!

మనుషులు చేతులతో చేసే పనిని కాళ్లతో కూడా చెయ్యొచ్చు అంటుంది సబా గుల్, పాకిస్తాన్ కి చందిన ఈ చిన్నారి చేతులు లేని ఎందరో మనుషులకి ఆదర్శంగా నిలుస్తుంది, ఇంత చిన్న వయసులో ఈ చిన్నారి ఆత్మస్థైర్యాన్ని చూసి అందరూ గర్వ పడుతున్నారు.

అసలు తన చేతులు ఎలా కోల్పోయింది అంటే..

అయిదేళ్ల వయసులో మేడ మీద తీగను రెండు చేతులతో పట్టుకుంది, కరెంటు షాక్ తగలడం తో చేతులు చచ్చుబడిపోయాయి, వెంటనే ఆసుపత్రి కి తీసుకువెళ్తే, డాక్టర్లకు ఏం చెయ్యాలో అర్ధం కాలేదు, వాళ్ళు ఆమె చేతులను తీసేసారు, అప్పటి నుండి ప్రతి పనిని కాళ్ళ తోనే చేస్తుంది.

చేతులు లేకుంటే ఏంటి…

సబా గుల్ మాట్లాడుతూ : “ఆసుపత్రి నుండి వచ్చాక తిరిగి చదువుకోడానికి స్కూల్ కి వెళ్లాలనుకున్నా, కానీ చుట్టు పక్కల వాళ్ళు చేతులు లేని అమ్మాయి ఎలా చదువుకుంటుంది, చదువుకొని ఏం చేస్తుందని మా అమ్మా నాన్న లను అనేవారు. నాకు చేతులు లేవని మా అమ్మ చాలా బాధ పడేది, నేనే ధైర్యం చెప్పేదాన్ని మా అమ్మకు, చుట్టు పక్కల వాళ్ళు నన్ను ఎత్తిపొడుస్తుంటే నాలో ఇంకా సాదించాలి అనే వ్యక్తిత్వం పెరిగింది. అత్తస్థైర్యాన్ని పెంపొందించుకున్నా, పట్టుదల పెరిగింది. అందుకే రాత నుండి పనుల వరకు కాళ్ళ తోనే చేసుకుంటా”.

బీబీసీ తెలుగు

తమ్ముడిని ఎత్తుకోలేకపోయా, అప్పుడు అర్థమైంది :

“నాకు ప్రమాదం జరిగినప్పుడు నాకు మూడు నెలల తమ్ముడు ఉన్నాడు, తనని ఇంటికి వెళ్లిన వెంటనే ఎత్తుకొని ముద్దాడాలనుకున్నా, కానీ నాకు చేతులు లేకపోయే సరికి చాలా బాధపడ్డా, అప్పుడు అర్థమైంది నా పరిస్థితి నాకు. లా చదివి మహిళల హక్కులు, మానవ హక్కుల కోసం పనిచేయాలని ఉంది. వివిధ ప్రాంతాలు తిరిగి మా సంస్కృతికి, వారి సంస్కృతులకు మధ్య ఎలాంటి వ్యత్యాసాలు ఉన్నాయో తెలుసుకోవాలని ఉంది. పాకిస్తాన్ సమాజంలో సానుకూల మార్పులు తేవాలని అనుకుంటున్నాను”, అని సబా గుల్ తెలిపారు.

 

Comments

comments

Share this post

scroll to top