కలలో ఆత్మహత్య.. నిజం చేసిన బాలిక

సాధారణంగా మనకి ఎన్నో కళలు వస్తుంటాయి. కొన్ని ఆనందాన్ని కలిగిస్తే..మరికొన్ని భయాందోళనలకు గురి చేస్తాయి. ఏదైనా పీడ కల వచ్చిన వెంటనే మనం లేచి కూర్చుంటాము, నీళ్లు తాగి మళ్ళీ పడుకుంటాము. కానీ ఆ కల మనకు కొన్ని రోజుల వరకు గుర్తొస్తూనే ఉంటుంది. తరవాత మరిచిపోతాము. కానీ ఓ 16 ఏళ్ల అమ్మాయి మాత్రం భిన్నంగా ఏం చేసిందో తెలుస్తే మీకు కన్నీళ్లొస్తాయి. తెలిసి తెలియని వయసులో తెలివితక్కువ నిర్ణయం తీసుకుంది..! ఈ విషాద ఘటన చెన్నైలో చోటు చేసుకుంది. వివరాలు మీరే చూడండి!

దుర్గ (16 ) ఇంటర్ చదువుతుంది. ఆమె తండ్రి చెన్నైలోని తాండయరుపేట వివ్డ్ పాల నగర్ కు చెందిన “వేలు ప్రైవేట్ సంస్థ” లో వాచ్ మెన్ గా పనిచేస్తున్నాడు. తరచూ తాను ఉరి వేసుకుని, ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని చనిపోయినట్లు కలలు వచ్చేవని దుర్గ తల్లితో చెప్పేది. ఆ కళను నిజం చేయాలనుకుందో..? లేక ఇంకేమైనా సమస్యతో బాధపడుతుందో తెలియదు కానీ.. శుక్రవారం (మే 5 న) ఇంట్లో ఎవరు లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకొంది. కేకలు విని అక్కడకు చేరుకున్న చుట్టుపక్కల వారు వెంటనే బాలికను కీల్పాక్కం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ దుర్గ శనివారం ఉదయం మృతిచెందింది.

Comments

comments

Share this post

scroll to top