మీ గర్ల్ ఫ్రెండ్ …ఫోన్ ను తరచూ చెక్ చేస్తున్నారా? అలా చేస్తే ఏమవుతుందో తెలుసా?

లవ్ లో ఈ మధ్య అనుమానం ఎక్కువైంది.  ఎంతగా అంటే లవర్/ గర్ల్ ఫ్రెండ్ ప్రతి కదలికలను స్పై చేసే అంతగా…!? గుడ్ నైట్ చెప్పాక కూడా  ఆమె వాట్సాప్   ఆన్ లైన్  లో ఉందా లేదా? అని గమనించడం,ఫేస్ బుక్ లో ఆమె పెట్టిన  పోస్ట్ కు ఎవరెవరు లైక్స్ కొట్టారు, ఎవరెవరు ఎటువంటి కామెంట్స్ చేశారు అని పరిశీలించడం…ఇలా చాలా మంది అబ్బాయిలు చేస్తుంటారు. ఇక ఇద్దరూ కలుసుకున్న టైమ్ లో…ఆమె ఫోన్ ను తీసుకొని…పరిశీలిస్తుంటారు. వాట్సాప్, ఫేస్ బుక్, ఫోటోలను చెక్ చేస్తుంటారు. ఇలా గర్ల్ ఫ్రెండ్ ఫోన్ ను తరచూ చెక్  చేసే అబ్బాయిల మీద సదరు అమ్మాయిల ఫీలింగ్ ఏంటి? అనే విషయంపై  ఓ సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో ఆసక్తికర నిజాలు బయటపడ్డాయి.

  • తమ బాయ్ ఫ్రెండ్స్ …ఇలా తమ ఫోన్స్ చెక్ చేయడం వల్ల…50 శాతం మంది అమ్మాయిలు…తమ లవర్స్ ను అసహ్యించుకుంటారంట…30శాతం బ్రేక్ అప్స్ ఈ విషయంలోనే అవుతాయట.!
  • ఇలా చేయడం….తమను అనుమానించడమే అని ఫీలయ్యి…30శాతం అమ్మాయిలు…ఇక్కడే తమ రిలేషన్ షిప్ ను కట్ చేసుకుంటారంట.!
  • 20 శాతం అమ్మాయిలు  ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోరట…ఎందుకంటే…నిజాయితీతో కూడిన ప్రేమలో… ప్రైవసీలు అవసరం లేదనేది వారి వాదనట.!అంతే కాదు…తమ ఫోన్ ను చెక్ చేసేంత ఫ్రీడమ్ తీసుకుంటున్న అబ్బాయిలు, వారి ఫోన్ ను తీసుకున్నా…ఎటువంటి అభ్యంతరం చెప్పొద్దు అనేది వీరి ఫీలింగ్.

కాబట్టి పురుష పుంగవులారా?? కాస్త ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆమె ప్రైవసీలో తలదూర్చే ప్రయత్నం చేయకండి.  స్వచ్చమైన ప్రేమలో అనుమానాలుండవ్…అనుమానులుంటే అది స్వచ్చమైన ప్రేమ కాజాలదు అనే లైన్ ను గుర్తుపెట్టుకోండి.

 

Comments

comments

Share this post

scroll to top