గర్ల్ ఫ్రెండ్ అడిగిందని హాస్టల్ కి బిర్యానీ తీసుకెళ్లాడు..! కానీ చివరికి ఏమైందో తెలుసా.? అసలు ఊహించి ఉండరు..!

రవితేజ ,శ్రీను వైట్ల కాంభినేషన్లో వచ్చిన సూపర్ హిట్ మూవీ నీకోసం సినిమాలో ఒక సీన్ ఉంటుంది గర్ల్ ఫ్రెండ్ అడిగిందని తన  హాస్టల్ కి బిర్యాణి తీసుకెళ్లి దొరికిపోయి వార్డెన్ ,వాచ్ మాన్,హాస్టల్ అమ్మాయిల చేతుల్లో చావుదెబ్బలు తింటాడు ఉత్తేజ్..అది చూడ్డానికి కామెడిగానే ఉంటుంది కానీ నిజజీవితంలో సేమ్ అలాంటి సీనే జరిగింది..గర్ల్ ప్రెండ్ అడిగిందని తనుంటున్న హాస్టల్ కి బిర్యాని తీసుకెళ్లాడు ఒక అబ్బాయి..ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడు..ఇంతకీ ఏం జరిగిందో తెలుసా…?

హన్మకొండలోని ఒక ప్రైవేటు హాస్టల్లో ఉంటున్న యువతి ,తన బాయ్ ఫ్రెండ్ని బిర్యానీ తీసుకురావలసిందిగా కోరింది…ప్రేయసి అడిగినట్టు బిర్యానీ తీసుకురాకపోతే నాపైన ప్రేమ లేదా అనే మాటొస్తుంది..మరొవైపు ప్రేయసి కోసం షాజహాన్ లా తాజ్ మహల్ కట్టించకపోయినా ఈ చిన్న కోరిక తీర్చలేనా అనుకున్నాడేమో..తను అడిగిందే తడవుగా ఆగమేఘాల మీద బిర్యాణీ పట్టుకుని హాస్టల్ కి బయలుదేరాడు..అది కూడా అర్దరాత్రి పదకొండు దాటిన తర్వాత ,వెళ్తూ వెళ్తూ స్నేహితుడ్ని తోడుగా తీసుకెళ్లాడా యువకుడు.. హాస్టల్ బిల్డింగ్ లో థర్డ్ ఫ్లోర్లో గర్ల్ ఫ్రెండ్ ఉండటంతో వెళ్లే వీలు లేక విషయాన్ని ఫోన్‌లో తెలియజేశాడు. దీంతో ఆమె గదిలోని అమ్మాయిలంతా కలిసి తమ చున్నీలను తాడులా కట్టి కిందకు వదిలారు..ఆ చున్నీలకు బిర్యానీ పాకెట్‌ను యువకుడు కట్టాడు. దీన్ని పైకి లాగుతున్న సమయంలో మధ్యలో ఉన్న కరెంటు తీగలను వారు గమనించలేదు. బిరియానీ ప్యాకెట్ పైకి లాగుతుంటే మధ్యలో ఉన్న రెండు కరెంటు తీగలు ఒకదానికి కొకటి తగులుకుని షార్ట్ సర్క్యూట్ అయింది. దీంతో ఒక్కసారిగా పెద్ద శబ్ధం వచ్చి, మంటలు చెలరేగాయి. హఠాత్తుగా చెలరేగిన మంటలకు చుట్టుపక్కల వారంతా తమ ఇళ్లలో నుంచి బయటకు వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడ నుంచి పారిపోబోతున్న యువకులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయితే, ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అబ్బాయిలను, అమ్మాయిలనూ హెచ్చరించి వదిలేసినట్టు పోలీసులు తెలిపారు…

ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు కాబట్టి సరిపోయింది..అలా కాకుండా ఏమన్నా ప్రమాదం జరిగి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది ఊహించుకోవడానికే భయంకరంగా ఉంది కదా..ఏ పనైనా చేసేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి..

Comments

comments

Share this post

scroll to top