పరీక్షలున్నాయని ఓ విద్యార్థిని హాల్ టికెట్ ని గుడిలో “దుర్గమ్మ” పాదాల దగ్గర పెట్టమంటే ఓ వ్యక్తి ఏం చేసాడో తెలుసా?

పదో తరగతి, ఇంటర్ పరీక్షలకి విద్యార్థులు ఎంతో కష్టపడుతూ ఉంటారు…పరీక్ష బాగా రాయాలని గుడికి వెళ్లి పూజిస్తుంటారు, హాల్ టికెట్ కి దేవుని పాదాల వద్ద కూడా పెడుతుంటారు!…కాకపోతే ఇది ఒక విద్యార్థిని పెద్ద కష్టం తెచ్చిపెట్టింది!..అసలు కథ ఏంటో చూడండి!

ఆ అమ్మాయిడి విజయవాడ…ఇంటర్ రెండో సంవత్సరం చదువుతుంది…మార్చ్ 2న మొదలయ్యే పరీక్షలకి బాగా కష్టపడి చదివింది…బుధవారం(మార్చ్ 2 ) న  ఇంటికి దగ్గరే ఉన్న “దుర్గమ్మ” గుడికి వెళ్లి ఆశీర్వాదాలు తీసుకోలి అనుకుంది…దర్శించుకుని ప్రదక్షిణాలు చేసింది…ఇంతలో ఒక వ్యక్తి అంతరాలయంలోకి వెళుతుంటే అతనికి హాల్ టికెట్ ఇచ్చి దుర్గమ్మ పాదాల వద్ద పెట్టమని అడిగింది..అతను హాల్ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాడు..బయటకి వచ్చాక అతనిని హాల్ టికెట్ ఇవ్వమని ఆ అమ్మాయి అడిగింది…

“నీ హాల్ టికెట్ నేను మరిచిపోయి హుండీలో వేసేసా…పరీక్ష రేపు కదా..! ఇంటర్నెట్ లో డౌన్లోడ్ చేస్కో” అని ఉచిత సలహా ఇచ్చి వెళ్ళాడు!

పాపం అమ్మాయి కంగారుగా గుడిలోకి వెళ్లి గుడి అధికారులను “హుండీ” తెరవమని అడిగింది…”ఎప్పుడు పడితే అప్పుడు హుండీ తెరువడం కుదరదు” అని గుడి అధికారులు కఠినంగా మాట్లాడారు…చివరికి అమ్మాయి కంట తడి పెట్టుకోవడం చూసి “రేపు (గురువారం) ఉదయం హుండీ తెరుస్తాము…ఉదయాన్నే వచ్చి తీసుకొని వెళ్లి పరీక్ష రాయి” అన్నారు!…
ఇక చేసేది ఏమి లేక ఆ విద్యార్థిని గురువారం ఉదయాన్నే గుడికి వెళ్ళింది…గంటలో పరీక్ష ఉంది అనే కంగారుతో వెళ్లి గుడి అధికారులను హాల్ టికెట్ గురించి అడిగింది…అయితే గుడి అధికారులు “హుండీ మేము తెరిచి చూసాము…హాల్ టికెట్ కనిపించలేదు” అని సమాధానం ఇచ్చారు!…డూప్లికేట్ హాల్ టికెట్ తీసుకుంటే సమయం కూడా లేకపోయింది అమ్మాయికి…మొత్తానికి ఒక వ్యక్తి నిర్లక్ష్యం వాళ్ళ ఒక విద్యార్థిని పరీక్ష రాయలేని పరిస్థితి వచ్చింది…ఆ అమ్మాయి పాపం అనవసరంగా నమ్మి మోసపోయింది!

 

Comments

comments

Share this post

scroll to top