ప్రేమకు పెద్దలు అడ్డుచెప్పారని మెట్రో రైల్ కింద దూకి ఆత్మహత్య చేసుకున్నయువతి?!

ఎప్పుడూ రద్దిగా ఉండే దేశ రాజధాని ఢిల్లీ లో సరిగ్గా సాయంత్రం 6.10 గంటల సమయంలో యమునా బ్యాంక్ మెట్రో స్టేషన్ దగ్గర ఓ యువతి ఫ్లాట్‌ఫాం నెంబర్ 3పై వెళ్తున్న మెట్రో రైలు కిందకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన యమునా బ్యాంక్ మెట్రో స్టేషన్ లో కలకలం రేపింది.  20 సెకండ్లలో  ఈ ఘోరం జరిగినట్లు సిసి కెమెరాల్లో  రికార్డయ్యింది. అందరూ ఎదురు చూస్తున్నట్టుగా ఆ అమ్మాయి  ట్రైన్ కోసం ఎదురు చూసింది, ట్రైన్ వస్తుందని చూసి వెంటనే పట్టాల మీదకు దిగి పట్టాలకు అడ్డంగా పడుకుంది. ప్లాట్ ఫామ్ మీది ప్రయాణికులు తేరుకునే లోపే ట్రైన్ ఆమె మీది నుండి దూసుకుపోయింది. అయితే అమె ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడమే కారణమనే ఊహాగానాలు వెలువడుతున్నాయ్.. ఆమె పేరు అంజలి అని 20 యేళ్ళు ఉంటాయని పోలీసులు గుర్తించారు.

ప్రేమ వ్యవహారమే కావొచ్చే మరేదైనా కావొచ్చు… ధైర్యంగా పోరాడాలి కానీ.ఇలా అర్థాంతరంగా తనువు చాలించడాన్ని ..మనకు ప్రాణాన్ని ప్రసాదించిన ఆ దేవుడు కూడా ఆమోదించడు.

Watch Video:

 

Comments

comments

Share this post

scroll to top