సెమీస్ లో ఇండియా ఓటమిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న యువతి!?

T-20 వరల్డ్ కప్ సెమీస్ లో వెస్టీండీస్ లో టీమ్ ఇండియా ఓటమిని తట్టుకోలేని ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. తన ఇంటిలోని ఫ్యాన్ కు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. పూర్తి వివరాళ్లోకెళితే….గ్వాలియర్ కు చెందిన ఓ యువతి విండీస్ తో ఇండియా సెమీస్ మ్యాచ్ ఆడుతున్నంత సేపు భారత్ గెలవాలని ప్రార్థించిందట, పూజలు కూడా చేసిందట… అయినప్పటికీ వెస్టిండీస్ చేతిలో ఇండియా ఓడిపోవడంతో ఇంట్లోని ఫ్యాన్ కు ఉరేసుకొని చనిపోయిందట. సదరు యువతి బిటెక్ చదువుతుందట…!

రంగంలోకి దిగన పోలీసులు …..యువతి ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ చేపట్టారు. తల్లీదండ్రులు పై వర్షన్ ను చెబుతున్నారు. పేరెంట్స్ మాటలను రికార్డ్ చేసుకున్న పోలీసులు…మరేవైనా ఇతర కారణాలున్నాయేమోనని ఆరా తీస్తున్నారు. ఆటను ఆటగానే చూడాలి….ఆటలో గెలుపుఓటములు సహజం అని గుర్తించాలి…అంతే కానీ మన జీవితాలను బలి చేసుకునేంతగా కాదు అని గుర్తించుకోవాలి.

Watch Video:

 

 

Comments

comments

Share this post

scroll to top