విమానం ని చేస్ చేసిన ఒక మహిళ, వైరల్ అయిన వీడియో.!

కదిలే బస్సు ని వెంబడించి ఎక్కవచ్చు, ట్రైన్ అయితే ఎవరో ఒకరు చైన్ లాగితే వెంబడించి ఎక్కవచ్చు. కానీ విమానాన్ని వెంబడించి ఎక్కగలమా? వినడానికి కొంచెం వింతగా ఉన్నా వెంబడించొచ్చు అని ఒక మహిళ నిరూపించింది, కానీ ఆమె ఆ విమానం ఎక్క లేక పోయింది.

విషయానికి వస్తే, ఇండోనేషియాకు చెందిన హనా అనే మహిళ బాలి నుంచి జకార్తాకు విమానంలో వెళ్లేందుకు టికెట్‌ బుక్‌చేసుకున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం బాలిలోని గురారాయ్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. కానీ అప్పటికే సమయం మించిపోవడంతో విమానం రన్‌వే పైకి చేరుకుంది. దీంతో ఎలాగైనా విమానం ఎక్కాలని భావించిన ఆమె భద్రతా సిబ్బందిని తప్పించుకుని మరీ అక్కడికి పరిగెత్తారు. ఇది గమనించిన సిబ్బంది హనాను ఆపేందుకు ప్రయత్నించగా. ఆమె ప్రతిఘటించారు. ఈ క్రమంలో హనా కిందపడిపోయారు. ఆమెను విమానాశ్రయ సిబ్బంది పట్టుకొని ఉన్నారు.

ఈ తతంగాన్ని మొత్తం, ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియా లో వదిలాడు. అంతే, ఇంకేముంది, మన నెటిజెన్ లు ఒకటే ట్రోల్ల్స్ ఆ అమ్మాయి మీద, తరువాతి విమానం కి వెళ్లొచ్చు కదా అని కొందరు అంటే, మరి కొందరు అయితే, పాపం ఎంత అవసరం ఉండెనో తనకి, అందుకే అంతలా ప్రయత్నించిందని ఆమెకు మద్దతుగా నిలిచారు, మొత్తానికి బాలి విమానాశ్రయ సిబ్బంది ని ఒక ఆట ఆడుకున్నారు హనా.

విమానాశ్రయంలో భద్రత చాలా కట్టు దిట్టంగా ఉంటుంది, కానీ అంత మంది భద్రతా సిబ్బంది ని తప్పించుకొని రన్ వే పైకి వెళ్లడం అంటే మాటలు కాదు, సాధారణంగా సినిమాల్లోనే ఇలాంటి ఘటనలను చూస్తూ ఉంటాం, కానీ నిజ జీవితం లో ఇలా జరగడం బహుశా ఇదే మొదటి సారి ఏమో.

Watch Video:

Woman Trying To Chase Down Plane:

Comments

comments

Share this post

scroll to top