కోతులతో కలిసి ఉంటూ..కోతిలా మారిపోయింది…

పిల్లులను,కుక్కలని చూస్తుంటే వాటిలా అరుస్తుంటాం..వాటిలా చేస్తుంటాం..ఎవరైనా ఎక్కువ అల్లరి చేసినా కోతి వేషాలు వేస్తున్నావ్ ..కోతి చేష్టలు ఎక్కువ అంటూంటాం.. ఇక్కడ ఒక అమ్మాయి అచ్చం కోతిలానే ప్రవర్తిస్తుంది..పరిస్థితుల ప్రభావమో లేక మరే కారణమో కానీ కోతులతో కలిసి ఉంటున్న ఎనిమిదేళ్ల బాలిక కోతిలా మారిపోయింది…

ఉత్తరప్రదేశ్ కి చెందిన ఎనిమిదేళ్ల చిన్నారి కొన్నాళ్లుగా కోతులతో కలిసి ఉంటూ కోతిలా మారిపోయింది.ఇప్పుడు అచ్చం కోతిలాగే తినడం.. కోతిలాగే ప్రవర్తిస్తోంది. మనుషులను చూస్తే భయపడడడం చేస్తుంది. రెండు నెలల క్రితం సబ్ ఇన్స్ పెక్టర్ సురేశ్ యాదవ్ ఎప్పటిలాగానే తన పెట్రోలింగ్ డ్యూటి చేసుకుంటుంటే …అతని కంట్లో పడింది ఈ అమ్మాయి..ఉత్తరప్రదేశ్ లోని  కతర్నియాఘాట్ అటవీ ప్రాంతంలోని శాంక్చురీలోని మోతిపూర్ రేంజ్ లో ఓ కోతుల గుంపులో ఈ బాలిక ఉంది.సురేశ్ తన పై అధికారులకు సమాచారం ఇవ్వడంతో అతికష్టం మీద పోలీసులు ఆ అమ్మాయిని అదుపులోకి తీసుకున్నారు..పోలీసులు ఆమెను కోతుల గుంపు నుండి కాపాడేందుకు ప్రయత్నిస్తుంటే.. కోతులతోపాటు ఆ బాలిక కూడా అరవడం మొదలుపెట్టింది..

ఏ భాషనూ అర్థం చేసుకోవడం లేదని.మనుషులు దగ్గరికొస్తే భయపడుతోందని. అప్పడప్పుడు వింతగా ప్రవర్తిస్తూ.. దగ్గరికి వెళితే దాడి చేస్తోందని ఆమెకు చికిత్స చేస్తున్న డాక్టర్లు అంటున్నారు .ఇంతకుముందు ఏదైనా పెడితే కోతిలాగే తినేదని, ఇప్పుడు ఆహారాన్ని నేరుగా నోటి ద్వారా తీసుకుంటుందని, కాళ్లపై నడిచేలా శిక్షణ ఇస్తున్నప్పటికీ ఆ బాలిక ఇప్పటికీ జంతువుల మాదిరిగా కాళ్లు చేతులు ఉపయోగించి నడుస్తోందని, చికిత్స తరువాత కొంత మేర కోలుకున్నట్లు కనిపిస్తోందని, నిదానంగా ఆమెలో మార్పు వస్తోందని డాక్టర్లు చెప్తున్నారు…

 

 

Comments

comments

Share this post

scroll to top