ఓ భారీ సైజ్ బ‌ల్లి ఆ వ్య‌క్తి ఇంటి గుమ్మం వ‌ద్ద‌కు వ‌చ్చింది… త‌రువాత ఏం జ‌రిగిందంటే..!

బ‌ల్లి, క‌ప్ప, పాము, బొద్దింక‌… ఆగండాగండి… వీటి పేర్ల‌న్నీ ఎందుకు చెబుతున్నారు. అవంటేనే, వాటి పేరు వింటేనే మాకు ఒళ్లు జ‌ల‌ద‌రిస్తుంది . అన‌బోతున్నారా? మీరు చెప్పేది క‌రెక్టే. అధిక శాతం మందికి పైన చెప్పిన విధంగా కొన్ని జంతువులు, కీట‌కాలు, పురుగులను చూస్తే ఒళ్లు జ‌ల‌ద‌రిస్తుంది. వాటిని చూసిన వెంట‌నే దూరంగా ప‌రిగెడ‌తారు. ఇంకొంద‌రైతే భ‌యంతో గంతులేస్తారు. అయితే ఆ ప్రాంతంలో నివసించే వారు మాత్రం అలా కాదు. డైనోసార్ సైజ్‌లో భారీగా ఉండే ఓ బ‌ల్లి వారి ఇండ్ల‌కు త‌ర‌చూ వ‌స్తుంటుంది. కానీ దాన్ని చూసి భ‌య ప‌డ‌రు స‌రిక‌దా, దాన్ని మ‌ళ్లీ తీసుకెళ్లి అడ‌విలో విడిచి పెడ‌తారు. అవును, మీరు విన్న‌ది నిజ‌మే.

monster-lizard

థాయ్‌లాండ్‌లోని స‌ముత్‌ప్ర‌క‌ర్ణ్ అనే ప్రాంతంలో ఉండే అట్ట‌నై థైయువాన్‌వాంగ్ అనే ఓ వ్య‌క్తి ఇంటికి ఇటీవ‌లే ఓ భారీ సైజులో ఉండే బ‌ల్లి వ‌చ్చింది. మ‌న ద‌గ్గ‌ర అలాంటి జీవిని ఉడుం అని కూడా పిలుస్తారు. దీంతో ఆ వ్య‌క్తి స‌ద‌రు బ‌ల్లిని ఫొటోలు, వీడియో తీసి త‌న ఫేస్‌బుక్ పేజీలో వాటిని పోస్ట్ చేశాడు. ఈ క్ర‌మంలో ఆ ఫొటోలు, వీడియో వైర‌ల్‌గా మారగా సోష‌ల్ మీడియాలో అవి హ‌ల్ చ‌ల్ చేశాయి. దీంతో అస‌లు విష‌యం బ‌య‌ట‌కు తెలిసింది.

ఆ బ‌ల్లి పేరు సెలీనా అట‌. దాన్ని స్థానికులు ఆ పేరుతో ముద్దుగా పిలుచుకుంటార‌ట‌. అది స్థానికంగా ఉన్న ఓ అడ‌విలో జీవిస్తుంద‌ట‌. అలా అది అప్ప‌డ‌ప్పుడు బ‌య‌ట‌కి వ‌చ్చి అంద‌రి ఇళ్ల వ‌ద్ద ఉన్న గుమ్మం వ‌ద్ద కొంత సేపు ఉంటుంద‌ట‌. అనంత‌రం ఆ ప్రాంత వాసులు దాన్ని అడ‌విలో విడిచిపెడ‌తార‌ట‌. ఇది వారికి మామూలేన‌ట. కానీ కొత్త‌గా ఈ విషయం తెలిసిన ప‌లువురు మాత్రం తెగ భ‌య‌ప‌డిపోయారు. అంతేగా మ‌రి. చిన్న బ‌ల్లిని చూస్తేనే కొంద‌రికి ఝ‌ల్లుమంటుంది. అంత‌టి పెద్ద సైజ్ బ‌ల్లిని చూస్తే ఇంకేమ‌న్నా ఉంటుందా, భ‌య‌ప‌డ‌డం త‌ప్ప‌.

భారీ బ‌ల్లి వీడియోను కింద చూడ‌వ‌చ్చు…

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top