టీవీ లో నుంచి దెయ్యం బ‌య‌టికి వ‌చ్చింది..! త‌రువాత ఏం జ‌రిగిందంటే..?

హార్ర‌ర్ సినిమాలంటే భ‌యం ఉండ‌నిదెవ‌రికి చెప్పండి..! వాటికి భ‌య‌ప‌డ‌ని వారు నూటికో, కోటికో ఒక్క‌రుంటారు. టీవీ లేదా సినిమా స్క్రీన్ల‌పై హార్ర‌ర్ సినిమాలు, షోలు చూస్తుంటేనే భ‌యం పుడుతుంది. మ‌రి అలాంటి వాటిలో ఉండే దెయ్యాలు రియ‌ల్ క్యారెక్ట‌ర్స్ రూపంలో బ‌య‌టికి వ‌స్తే ఎలా ఉంటుంది..? మీ మాట గానీ… అలా తెర‌పై ప్ర‌ద‌ర్శించే బొమ్మ‌లు రియ‌ల్ లైఫ్‌లోకి ఎలా వ‌స్తాయి..? అనేగా మీరు అడ‌గ‌బోయేది..! అయితే ఇప్పుడు మేం చెప్ప‌బోయేది వింటే మాత్రం… అలా అడ‌గ‌డం మానేస్తారు. ఎందుకంటే హార్ర‌ర్ సినిమాలో ఉండే ఓ దెయ్యం క్యారెక్ట‌ర్ నిజంగానే బ‌య‌టికి వ‌చ్చింది మ‌రి..!

ghost-character-tv

న్యూయార్క్‌లో అదొక టీవీ స్టోర్‌. టీవీలు అమ్మే షాపు. అందులో కొన్ని వంద‌ల సంఖ్య‌లో టీవీలున్నాయి. వాటిని కొనుగోలు చేసేందుకు క‌స్ట‌మ‌ర్లు వ‌స్తున్నారు. అయితే అప్పుడే స‌డెన్‌గా ఓ టీవీలో నుంచి దెయ్యం పిల్ల బ‌య‌టికి వ‌చ్చింది. దీంతో టీవీల‌ను కొనాల‌ని అక్క‌డికి వ‌చ్చిన వారు ఒక్క‌సారిగా భ‌యం చెంది, ఉలిక్కి ప‌డి ప‌రుగు లంకించుకున్నారు. అయితే… నిజానికి చెప్పాలంటే అది రియ‌ల్ దెయ్యం పిల్ల కాదు. ఆ టీవీ స్టోర్ వారు ఏర్పాటు చేసిందే.

క‌స్ట‌మ‌ర్లు రావ‌డానికి ముందే ఓ టీవీ వెనుక చిన్న‌పాటి గ‌ది ఏర్పాటు చేసి అందులో ఓ బాలిక‌ను అచ్చం ది రింగ్ ఇంగ్లిష్ సినిమాలోని దెయ్యం పిల్ల‌లాగా ఉంచారు. ఇంకేముందీ… క‌స్ట‌మ‌ర్లు రాగానే ఆ పిల్ల కాస్తా టీవీని త‌ప్పించి బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. దీంతో క‌స్ట‌మ‌ర్లు కంగుతిని ఒక్క‌సారిగా భ‌య‌ప‌డ్డారు. అదీ జ‌రిగిన విష‌యం… అంతేగానీ… తెర‌లోనుంచి నిజంగా దెయ్యం రాలేదు సుమా..! మీర‌న్న‌ట్టుగా అస‌లు సినిమాల్లోని దెయ్యం క్యారెక్ట‌ర్లు రియ‌ల్ లైఫ్‌లోకి ఎలా వ‌స్తాయి..? అది ఉత్త భ్ర‌మ కాక‌పోతే..!

Comments

comments

Share this post

scroll to top