నెలకు 700 రూపాయలు మీ అకౌంట్ లో జమవుతుంది…అదెలాగో తెలుసా? రేషన్ కార్డు ఉంటే చాలు.!

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తమకు ఓట్ల వర్షం కురిపించేందుకు అనేక ఆర్థిక లబ్ది చేకూర్చే పథకాలను కేంద్ర ప్రభుత్వం వెతుకుతుండగా అందులో ఒకటి రేషన్ వస్తువులకు బదులుగా డబ్బు ఇవ్వడం, ఇళ్లపేరిట సబ్సిడీ ఇవ్వడం అనేవి ప్రభుత్వ పెద్దల దృష్టికి వచ్చాయట. అందుకే ప్రభుత్వ కొత్త పథకాన్ని అమల్లోకి తీసుకురానుందట.రేషన్ షాపుల దగ్గర పడిగాపులు కాయడం,రేషన్ లేదంటే నిరాశతో వెనుదిరగడం లాంటివి ఇకపై ఉండవని అంటున్నారు..ప్రభుత్వం అమల్లోకి తేవాలనుకుంటున్న పథకం ఏంటంటే..

కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ గా రేషన్ కార్డు ఉన్న వ్యక్తుల అక్కౌంట్ లోకి ప్రతినెలా 700 రూపాయల నగదును బదిలీ చేసే ఏర్పాటు చేయబోతుందట. ఆరుగురు వ్యక్తులున్న ఇంటికి ఒక్కొక్కరికి నాలుగు కేజీల చొప్పున బియ్యం ఇస్తుంది. అంటే 24 కేజీలు. ఒక్కో కేజీకి 25 రూపాయల చొప్పున చెల్లించే ఏర్పాటు చేసింది. అంటే 640 రూపాయలు. మిగతా వాటితో కలిపి 700 రూపాయలను కేంద్రం వారి అక్కౌంట్లోకి బదిలీ చేస్తుందని సమాచారం, అలా అక్కౌంట్ లోకి బదిలీ అయిన 700 రూపాయలతో ఎవరి ఇష్టం వచ్చిన వస్తువులను వారు కొనుగోలు చెయ్యొచ్చు. ఈ పథకాన్ని ఇప్పటికే పుదుచ్చేరి, చండీఘర్, దాద్రానగర్ హవేలీలో అమలులో ఉంది. ఈ పథకం అక్కడ విజయవంతం కావడంతో.. మిగతా రాష్ట్రాల్లో కూడా వీటిని అమలు చేయాలని నిర్ణయించిందని సమాచారం.

అయితే దీనిపై విమర్శలు వినిపిస్తున్నాయి సబ్సిడి ధరకే పేదలకు బియ్యంతో పాటు నిత్యావాసర వస్తువులు అందించాల్సిన ప్రభుత్వం ఇప్పుడు రేషన్ షాపులకు గండి కొట్టే ప్రయత్నం ఇదని వాపోతున్నారు.ఏడువందల రూపాయలకు ఒక కుటుంబ అవసరాలు ఎలా తీరతాయని,కేవలం బియ్యం కొనుక్కుంటే సరిపోతుందా..మిగతా పప్పులు ,ఉప్పులు ఎక్కడి నుండి వస్తాయని ప్రశ్నిస్తున్నారు.ఇప్పటికే రేషన్ షాపుల్లో ఇవ్వాల్సిన వస్తువులు అంతంత మాత్రం ఇప్పుడు ఇలాంటి పథకాలు పేదల కడుపుకొట్టడం తప్ప మరే ఉపయోగం ఉండదని విమర్శ చేస్తున్నారు..చూడాలి ఏం జరుగుతుందో…

Comments

comments

Share this post

scroll to top