ఒక త‌ల‌కు 50 త‌ల‌లు తెగాల్సిందే..! ఓ భార‌త జ‌వాను కూతురు ఆవేద‌న ఇది..!

పైశాచికానందానికి మారుపేరు పాకిస్థాన్ ఆర్మీ. అవును, క‌రెక్టే. ఆ ప‌దం వారికి క‌రెక్ట్ గా సూట‌వుతుంది. ఎందుకంటే వారే క‌దా త‌మ ప్ర‌భుత్వ ఆదేశాల‌తో భార‌త ఆర్మీ సిబ్బందిని ఎప్పుడూ కవ్విస్తుంటారు. అంత‌టితో వారు ఆగ‌రు. దాడుల‌కు తెగ‌బ‌డ‌డం, భార‌త జ‌వాన్ల‌ను అత్యంత కిరాత‌కంగా చంప‌డం వారికి అల‌వాటే. అందుకే వారిది పైశాచికానందం అన్నది. నిజానికి అస‌లు ఆ మాట కూడా వారికి త‌క్కువే. ఎందుకంటే తాజాగా జ‌రిగిన జ‌వాన్ల చంపివేత ఘ‌ట‌నే వారి మొద్దుబారిన మెదడుకు, రాక్ష‌స‌త్వానికి నిద‌ర్శ‌నం. నిజంగా ప్ర‌పంచంలో పాకిస్థాన్ ఆర్మీని మించిన వెధ‌వ‌లు ఎవ‌రూ ఉండ‌రేమో..? అందుకే అంతా పిచ్చిప‌ట్టిన‌ట్టుగా ప్ర‌వర్తిస్తున్నారు.

జమ్మూకాశ్మీర్‌ పూంఛ్‌లో నియంత్రణ రేఖ వద్ద మే 1వ తేదీన‌ ఉదయం 8.30 గంటల సమయంలో పాక్‌ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి భారత సైన్యంపై కాల్పులకు దిగింది. అప్రమత్తమైన భారత జవాన్లు ఎదురుకాల్పులు ప్రారంభించారు. ఓవైపు కాల్పులు జరుగుతుండగానే మరోవైపు పాకిస్థాన్‌కు చెందిన బోర్డర్‌ యాక్షన్‌ టీం(బీఏటీ) సభ్యులు 250 మీటర్ల మేర భారత భూభాగంలోకి చొచ్చుకు వచ్చారు. బీఏటీలో పాక్‌ సైనికులతోపాటు ఉగ్రవాదులు సభ్యులుగా ఉంటారు. బీఏటీ సభ్యులు భారత భూభాగంలోకి చొరబడిన సమయంలో కృష్ణా ఘాటి సెక్టార్‌లోని బోర్డర్‌ పోస్టుల్లో 22 సిక్కు బెటాలియన్‌కు చెందిన తొమ్మిది మంది బృందం విధులు నిర్వహిస్తోంది. వీరిపై బీఏటీకి చెందిన ముష్కరులు మోర్టార్లతో పెద్ద ఎత్తున కాల్పులకు తెగబడ్డారు. కాల్పుల్లో నాయిబ్‌ సుబేదార్‌ పరంజీత సింగ్‌, బీఎస్ఎఫ్ హెడ్‌ కానిస్టేబుల్‌ ప్రేమ్‌ సాగర్‌ వీరమణం పొందగా, వారి శరీరాలను ముక్కలు ముక్కలు చేసిన బీఏటీ సభ్యులు అనంతరం వెనక్కి వెళ్లిపోయారు. ఈ ఘటనలో మరో బీఎస్ఎఫ్ కానిస్టేబుల్‌ రాజిందర్‌ సింగ్‌ గాయపడ్డారు.

ఈ ఘ‌ట‌న‌తో ఒక్క‌సారిగా భార‌త ప్ర‌జ‌లు దిగ్భ్రాంతికి లోన‌య్యారు. పాకిస్థాన్ క‌వ్వింపు చ‌ర్య‌లను, వారు చేసిని ప‌నిని ముక్త కంఠంతో అంద‌రూ తీవ్రంగా ఖండించారు. ఇక నాయ‌కులు ఎప్పుడు చెప్పిన‌ట్టుగానే పాక్ చ‌ర్య‌ల‌కు ప్ర‌తీకారం తీర్చుకుంటామ‌ని బ‌దులిచ్చారు. ఇదిలా ఉండ‌గా మ‌రో వైపు భార‌త ఆర్మీ సిబ్బంది పాకిస్థాన్‌కు చెందిన రెండు బంక‌ర్ల‌ను పేల్చి వేశారు. ఈ ఘ‌ట‌న‌లో 7 మంది పాక్ సైనికులు చ‌నిపోయారు. అయితే ముష్క‌రుల కాల్పుల్లో చ‌నిపోయిన నాయిబ్‌ సుబేదార్‌ పరంజీత సింగ్‌, బీఎస్ఎఫ్ హెడ్‌ కానిస్టేబుల్‌ ప్రేమ్‌ సాగర్ ల కుటుంబ స‌భ్యులు ఒక్క‌సారిగా హ‌తాశుల‌య్యారు. అంత ఘోరంగా వారు చ‌నిపోవ‌డాన్ని ఆ కుటుంబ స‌భ్యులు జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఎలాగైనా పాక్‌కు బుద్ధి చెప్పాల‌ని వారు కోరుతున్నారు. బీఎస్ఎఫ్ హెడ్‌ కానిస్టేబుల్‌ ప్రేమ్‌ సాగర్ కుమార్తె అయితే చ‌నిపోయిన ఒక భార‌త జ‌వాను త‌ల‌కు 50 మంది పాక్ సైనికుల త‌ల‌లు తెగి ప‌డాల‌ని చెప్పింది. అలా తెగితేనే త‌న తండ్రి ఆత్మ శాంతిస్తుంద‌ని ఆమె తెలియ‌జేసింది. ఇక నాయ‌కులు ఇప్పుడైనా క‌ళ్లు తెరిచి స్పందిస్తేనే పాక్‌కు గ‌ట్టిగా బుద్ధి చెప్ప‌గ‌లం..! అది జ‌రుగుతుందా..? లేదా అన్న‌ది… చూడాలిక‌..!

Comments

comments

Share this post

scroll to top