ప్ర‌స‌వించే మ‌హిళ ప‌డే బాధ‌ల‌ను, నొప్పుల‌ను ఆ కన్స‌ల్టెన్సీలో పురుషులు అనుభ‌విస్తారు…

స్త్రీలు గ‌ర్భం ధ‌రించిన‌ప్ప‌టి నుంచి పిల్ల‌ల్ని క‌ని వారిని ఓ వ‌య‌స్సు వ‌చ్చే వ‌ర‌కు జాగ్ర‌త్త‌గా పెంచుతూ ఎంత క‌ష్ట‌ప‌డ‌తారో అంద‌రికీ తెలిసిందే. ప్ర‌ధానంగా గ‌ర్భ‌ధార‌ణ‌, ప్ర‌స‌వం స‌మ‌యాల్లోనైతే వారు మాన‌సికంగానే కాదు శారీర‌కంగా కూడా ఎంతో బాధ ప‌డ‌తారు. ఆ బాధ అనుభ‌వించే వారికే తెలుస్తుంది. పురుషులైతే ఆ బాధను అనుభ‌వించ‌రు క‌దా. ఈ క్ర‌మంలో పురుషులు కూడా అలాంటి బాధ‌ను నిజంగా అనుభ‌వించేలా, మాతృత్వంలో ఉండే క‌ష్టం వారికి కూడా తెలిసేలా ఓ మ‌హిళ క‌న్స‌ల్టెన్సీని ఏర్పాటు చేసింది. ఇంత‌కీ అందులో ఏం చేస్తార‌నేగా మీరు అడ‌గ‌బోయేది, అదే విష‌యం తెలుసుకుందాం రండి.

mr-mommys

జేన్ జియాంగ్ అనే ఓ మ‌హిళ జాయ్‌మామ్ పేరిట ఓ క‌న్స‌ల్టెన్సీని ప్రారంభించింది. అందులో పురుషుల‌కు ఓ ప్ర‌త్యేక‌మైన కోర్సును ఆమె ప్ర‌వేశ పెట్టింది. అదేమిటంటే మ‌హిళ‌లు ప్ర‌స‌వం స‌మ‌యంలో ప‌డే నొప్పుల‌తోపాటు ప్ర‌స‌వానంతరం పిల్ల‌ల‌కు పాలివ్వ‌డం, వారి డైప‌ర్లు మార్చ‌డం, వారి బాగోగులు చూడ‌డం వంటి అన్ని ప‌నుల‌ను ఆ కోర్సులో చేరే పురుషుల‌తో చేయిస్తారు. ఈ క్ర‌మంలో వారికి మ‌హిళ‌లు ప‌డే బాధ, వారికి క‌లిగే నొప్పుల‌ను కూడా వివిధ ర‌కాల ప‌రిక‌రాల ద్వారా క‌లిగిస్తారు. దీంతో ప్ర‌స‌వం స‌మ‌యంలో, అది జ‌రిగాక మ‌హిళ‌లు ఎంత‌టి బాధ ప‌డ‌తారో అది ఆ పురుషుల‌కు తెలుస్తుంది. కాగా ఈ కోర్సులో చేరాలంటే పురుషులెవ‌రైనా 1వేయి బ్రిటిష్ పౌండ్లు (దాదాపు రూ.1ల‌క్ష‌) చెల్లించాల్సి ఉంటుంది. అలా చెల్లించాక వారు 10 రోజుల పాటు ఒకే నివాసంలో ఉండాల్సి ఉంటుంది. ప్ర‌సవించిన మ‌హిళ‌ల‌కు క‌లిగే బాధ‌ల‌న్నింటినీ ఆ సమ‌యంలోనే వారికి అక్క‌డి శిక్ష‌కులు ప‌రిచ‌యం చేస్తారు.

mr-mommys

mr-mommys

మాతృత్వం అంటే ఎంతో మ‌ధుర‌మైంద‌ని కానీ అందులో మ‌హిళ ఎంత‌గానో క‌ష్టం, బాధ‌ను ఎదుర్కొంటుంద‌ని, అది మ‌గ‌వారికి నిజంగా తెలియాల‌నే ఉద్దేశంతోనే అలాంటి కన్స‌ల్టెన్సీని ఏర్పాటు చేసిన‌ట్టు జేన్ తెలియజేస్తోంది. ప్ర‌స‌వించిన మ‌హిళ‌లను వారి భ‌ర్త‌లు చిన్న చూపు చూడ‌కూడ‌ద‌ని, వారు ప‌డే బాధను పంచుకోవాల‌ని ఆమె సూచిస్తోంది. అవును మరి. మాతృత్వం అనే నిజంగా మ‌ధుర‌మైన అనుభూతే. కానీ దాంట్లో ఉన్న బాధ‌ల‌ను, క‌ష్టాల‌ను భ‌ర్త కూడా పంచుకున్న‌ప్పుడే అత‌ని భార్య‌కు నిజ‌మైన ఆనందం క‌లుగుతుంది. అవును క‌దా.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top