జీవితంలో గెలవాలనుకునే ప్రతిఒక్కరికి సంభందించిన మెసేజ్..మీరూ చదవండి..!!

జీవితంలో ఏదో ఒకటి సాధించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.కొందరు తాము కన్న కలని సాకారం చేసుకోవడానికి కష్టపడుతుంటారు. అలా కష్టపడే క్రమంలో ఎన్నో ఆటుపోట్లు ఎదురవుతున్నా కూడా వాటిని లెక్క చేయకుండా విజయం సాధించేవారు కొందరుంటారు..అలాంటప్పుడు మన పక్కనొకడుంటాడు..అదేపనిగా మనల్ని మన పనుల్ని గేలి చేయడమే పనిగా పెట్టుకున్నవాడు..వాడు ఎలాంటోడు,ఎలాంటి పనులు చేస్తాడు.వాటిని లెక్క చేయక మనం ఎలా ముందుకెళ్లాలి అనే దానిపై వాట్సప్లో ఒక మెసేజ్ చక్కర్లు కొడుతుంది..ఒకసారి మీరు చదవండి.

జీవితంలో మనతో ఒకడు
***

మోసం చేయాలనుకుంటాడు
ముంచాలనుకుంటాడు 
తొక్కలనుకుంటాడు
పోల్చుకుంటాడు
వెటకారం చేస్తాడు
అవమాన పరుస్తాడు
చెడు ప్రచారం చేస్తాడు
ఎదుగుదలను ఒరవడు
ద్రోహం చేస్తాడు
వెన్ను పోటు పొడుస్తాడు
నటిస్తాడు
తక్కువ చేసి మాట్లాడుతాడు
బలం గురించి కంటే బలహీనత గురించే మోగిస్తాడు
జాలి చూపిస్తున్నట్లు ఉంటాడు
డబ్బుతో పోలుస్తాడు

మన నష్టంతో

సంతోష పడుతాడు
డప్పు కొడుతాడు
చాప్టర్ క్లోజ్ అంటాడు..
నమ్మడు
చేతకానిది ఎందుకు చేయాలి అంటాడు
అలాగే కావాలి అంటాడు

ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో సందర్భాలు ,ఎన్నో సంఘటనల మధ్య నుండి జీవితం దూసుకుపోవాలి … నువ్వు వారి మాటలకూ అక్కడే ఆగితే … నువ్వో దద్దమ్మ వి, వాడు అక్కడే ఉంటాడు … నువ్వే చేరే చోటకి చేరు. చెయ్ సవాల్ దీనమ్మ జీవితం …

చావో … రేవో
నీతో … నీ లక్ష్యంతో
వాడి గురించి సమయం వృధా చేయకు
మన ప్రయాణంలో వాడొక గడ్డి పరకతో సమానం
ఇలాంటి వారు ఎందరో వస్తారు పోతారు
మన ప్రయాణం … మనదే
ఎందుకంటే
ఈ జీవితం మనది ,వాడిది కాదు
వాడు సరదాకు బ్రతుకుతాడు
మనం సచ్చాక బ్రతకాలి
చెయ్ .. సవాల్ నీతో …
నువ్వు ..
నీ పై నువ్వు.. 👍🌹👍

Recent ga Naku baga nachina WhatsApp message.🌷

Comments

comments

Share this post

scroll to top