వివాదాస్పద దర్శకుడిగా పేరొందిన రామ్గోపాల్ వర్మ.. తాజాగా న్యూ ఇయర్ విషెస్ చెప్పుకునే వారిపై విరుచుకు పడుతూ సోషల్మీడియా వేదికగా పలు కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. న్యూ ఇయర్ విషెస్ చెప్పుకోవడం వల్ల ఒరిగేదేమీ లేదంటూ తనదైన స్టైల్లో చెప్పిన వర్మ.. ఉచితంగా వచ్చే మెసేజ్లను చెప్పడం కాదు, నిజంగా మీరు ఇతరుల శ్రేయస్సు, సంతోషాలను కోరుకునే వ్యక్తులే అయితే మీ డబ్బు, విలువైన వస్తువులను దానం చేయాలి అంటూ వ్యాఖ్యలు చేశాడు.
అయితే తాజాగా వర్మ పెట్టిన ఈ పోస్ట్లపై అదిరిపోయే కౌంటర్ వేసింది పాపులర్ సింగర్ గీతా మాదిరి. ‘నా వరకైతే.. ప్రతీ రోజూ ప్రత్యేకమైనదే. అందరూ నవ్వుతూ బ్రతకాలని చెబుతుంటారు ఇందులో ఏ ఖర్చూ లేదు. ఆ మాదిరిగానే కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలపడం కూడా ఎదుటివారిలో అనుకూలతను పెంచడమే. పైగా ఇది ఉచితంగా అందరిలో అనుకూలతను పెంచే అంశం. ఒకవేళ దానికోసం ఏదైనా ఖర్చు చేస్తే తిరిగి దానినుండి మరేదైనా ఆశిస్తారు. ఇది కాసింత ప్రతికూలత పెంచే అవకాశం ఉంది’ అని కామెంట్ చేసింది.