గీతామాధురి సంచలన వ్యాఖ్యలు..! ఆ దర్శక, నిర్మాతలు నన్ను రమ్మన్నప్పుడు..!

తెలుగు వారిని టాలివుడ్ పట్టించుకోదని,ఇండస్ట్రీలో వేషాలు కావాలంటే ఖచ్చితంగా పడుకుని తీరాలి అని శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమ్మురేపుతున్నాయి.గతంలో ఎందరో హీరోయిన్లు కాస్టింగ్ కౌచ్ వ్యవహారంపై మాట్లాడినప్పటికి శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్రరూపం దాల్చాయి.శ్రీరెడ్డికి మద్దతుగా జూనియర్ ఆర్టిస్టులు,నటులు వస్తుండగా,అర్దనగ్న నిరసనతో దేశవ్యాప్తంగా టాలివుడ్లో కాస్టింగ్ కౌచ్ వ్యవహారం సంచలనం సృష్టించింది..తాజాగా గాయని గీతామాధురి కాస్టింగ్ కౌచ్ ,తన అనుభవాలను మీడియాతో పంచుకుంది.

గాయని గీతా మాధురి ఎన్నో ఏళ్లుగా  ఇండస్ట్రీలో ఉంది..తన గాత్రంతో అందరిని అలరించింది.కెరీర్ పీక్ స్టేజ్లో ఉండగానే నటుడు నందుని వివాహం చేసుకుంది..నందు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల    గీతామాధురి కూడా తనకు ఎదురైన కొన్ని సమస్యలను వివరిస్తూ తీవ్ర ఆవేదనను వ్యక్తం చేసింది..గీతామాధురి బుల్లితెర నుండి వెండితెరకు పరిచయం అయ్యింది.ఒక టీవి ఛానెల్లో వచ్చిన పాటల కార్యక్రమం ద్వారా సినిమాల్లో అవకాశల కోసం ప్రయత్నించింది..ఆ క్రమంలో కొందరు డైరెక్టర్లు తనతో అసభ్యంగా ప్రవర్తించారని..ఇండస్ట్రీలో ఇలాంటివి ఉంటాయని తన స్నేహితులు ముందుగానే చెప్పారని చెప్పుకొచ్చింది.

గీతా మాధురి ఆవేదన తన మాటల్లోనే ” మొదట్లో తెలుగు సినీపరిశ్రమలో నాకు ఇచ్చిన ప్రాధాన్యతను చూసి సంతోషపడ్డా. ఆ తరువాత చాలా ఇబ్బందులకు గురయ్యా. అదే అవకాశాలు కావాలంటే దర్శకులు, నిర్మాతలు రమ్మని పిలవడం. నేను గాయనిని. నాకు కూడా ఇలాంటివి ఉంటాయని అనుకోలేదు. కొంతమంది దర్శకులు, నిర్మాతలు నన్ను రమ్మన్నప్పుడు చాలా బాధపడ్డా. నా టాలెంట్‌కు ఇప్పటితో పుల్‌స్టాప్ పడిపోతుందని అనుకున్నా. కానీ నన్ను అలా పిలిచిన దర్శకుల దగ్గరకు అస్సలు వెళ్ళలేదు. వారి గురించి ఆలోచించడం తగ్గించాం. మంచి వ్యక్తులు అవకాశాలు ఇస్తే సినిమాల్లో పాటలు పాడాలని నిర్ణయించుకున్నా. అనుకున్న విధంగానే నాకు మరికొంతమంది అండగా నిలిచారు.. అవకాశాలిచ్చారు. ఇప్పుడు తెలుగు సినీపరిశ్రమలో నేను గాయనిగా మంచి గుర్తింపును సంపాదించుకుంటూ వెళుతున్నందుకు ఎంతో సంతోషపడుతున్నానంటోంది గాయని గీతామాధురి.

 watch video here:

Comments

comments

Share this post

scroll to top