“గీతాంజలి” చిత్రంలో “నాగార్జున” సరసన నటించిన “గిరిజ” గుర్తుందా..? ఇప్పుడెలా ఉందో తెలుసా..?

“అందరం చచ్చిపోయే వాళ్ళమే..
ఆ స్టేషన్ మాస్టర్ చచ్చిపోతాడు…
ఆ పోర్టర్ చచ్చిపోతాడు..
ఆ తోటమాలి చచ్చిపోతాడు…

ఎందుకంటే నేను భరించలేను…
ఎందుకంటే రేపు నువ్వు ప్రాణాలతో ఉంటావో తెలీదు…
ఎందుకంటే నా ప్రాణం కంటే నువ్వు నాకు ముఖ్యం..”

ఈ డైలాగ్స్ వినగానే మీకు అర్ధం అయిపోయి ఉంటది నేను మాట్లాడేది “మణిరత్నం” గారి “గీతాంజలి” సినిమా గురించి అని. నాగార్జున కెరీర్ లో మంచి క్లాసిక్ సినిమాగా నిలిచిపోయింది “గీతాంజలి”. ఇప్పటికి మనం “ఓ ప్రియా ఓ ప్రియా”, “నందికొండ వాగుల్లోనా” అని పాటలు పాడుకుంటూనే ఉన్నాము. మొట్టమొదటిసారిగా తెలుగు సినిమాలో హీరో హీరోయిన్లు క్లైమాక్స్ లో చనిపోయినా ఆడియన్స్ కనులవెంట నీళ్లు తెప్పించి సూపర్ హిట్ కొట్టిన సినిమా “గీతాంజలి”. ఆడియన్స్ అభినందనలు మాత్రమే కాదు, ఎన్నో అవార్డ్స్ కూడా అందుకుంది “గీతాంజలి” సినిమా.

ఈ సినిమాలో “నాగార్జున”కు జత కట్టిన అల్లరి పిల్ల పాత్రలో నటించిన “గిరిజ” గుర్తుందా..? సినిమా వచ్చి ఎన్నో సంవత్సరాలు దాటింది. ఇప్పుడు “గిరిజ” ఎలా ఉన్నారు? ఎక్కడ సెటిల్ అయ్యారు? గీతాంజలి తరవాత సినిమాలు ఎందుకు చేయలేదు?

టీవీ 9 “అన్వేషణ” ఇంటర్వ్యూలో గిరిజ గారు మాట్లాడుతూ “తెలుగులో ఒక సినిమా, హిందీలో ఒక సినిమా చేసిన తరవాత “ఆధ్యాయాత్మిక” వైపు వెళ్ళిపోయాను. మలయాళం లో ఒక సినిమా చేశాను. మిస్టర్ ఇండియాలో శ్రీదేవి నటన నాకెంతో నచ్చింది..” ఇలా చెప్పడమే కాక ఇంకేం చెప్పిందో వీడియోలో చూడండి!

watch video here:

(Interview with geetanjali actress girija)

Comments

comments

Share this post

scroll to top