క్యాన్సర్ తో బాధపడుతున్నపిల్లలను అక్కున చేర్చుకొని వైధ్యం అందిస్తున్న మానవతావాది.

అడగందే అమ్మయినా పెట్టదని పెద్దలు చెబుతారు. అయితే ఆ అమ్మ మాత్రం ఆ పిల్లలకు అడగకుండానే అన్నీ ఇస్తోంది. కడుపున పుట్టకపోయినా కన్నతల్లిలా, ఇంకా చెప్పాలంటే అంతకంటే ఎక్కువగానే ఆ పిల్లల బాగోగులను చూస్తూ వారికి అన్నే తానే అయి సంరక్షిస్తోంది. తన తండ్రి కోరిన చివరి కోరికను, ఆయన ఆశయాలను నెరవేరుస్తూ ప్రమాదకర క్యాన్సర్‌లతో బాధపడుతున్న పిల్లలకు దేవతలా మారింది.
ఆమె గీతా శ్రీధర్. ముంబైలోని సియోన్ అనే ప్రాంతంలో నివాసం ఉంటోంది. అక్కడే స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. కాగా ఆమె తండ్రికి ఒక రోజు తీవ్రమైన అనారోగ్యం సంభవించింది. ఈ నేపథ్యంలో వైద్య పరీక్షలు చేయించగా ఆయనకు క్యాన్సర్ 4వ దశలో ఉందని తేలింది. అనంతరం కొద్ది రోజులకే ఆయన మృతి చెందారు. అయితే ఆయన మరణించే ముందు తన కూతురు గీతా శ్రీధర్‌ను ఓ కోరిక కోరారు. అదేమిటంటే ఆపదలో ఉన్న పేదలకు సహాయ అందించమని చెప్పాడు. కాగా గీతా శ్రీధర్ తన తండ్రి చనిపోయిన కొద్ది రోజులకు ఆ కోరికను నెరవేర్చే దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది.
1557453_890883971041323_7701135208857148770_n
ఈ క్రమంలో గీతా శ్రీధర్‌కు పూణెలో ఉన్న ఓ వైద్యుడు పరిచయమయ్యాడు. క్యాన్సర్‌తో బాధపడుతూ వైద్య సహాయం అందించేవారు లేక అంత్య దశలో ఉన్న చిన్నారులను గురించి ఆమెకు ఆ వైద్యుడు తెలియజేశాడు. దీంతో గీతా శ్రీధర్ వెంటనే వారికి సహాయం అందించాలనుకుని నిర్ణయం తీసుకుంది. అనుకున్నదే తడవుగా వారందరినీ ముంబైలోని తన ఇంటికి తీసుకొచ్చింది. అలా మొత్తం 28 మంది పిల్లలకు తన ఇంట్లో ఆశ్రయం కల్పించింది.
అంతటితో గీతా శ్రీధర్ ఊరుకోలేదు. వారి బాగోగులన్నీ ఆమే చూసేది. తానే స్వయంగా రోజూ ఆహారం వండి వడ్డించేది. దీంతోపాటు వారి వైద్యానికి అయ్యే ఖర్చులను ఆమె భరించేది. కాగా ఒక్కో చిన్నారికి ఒక్కో స్టేజిలో ఉన్న క్యాన్సర్ ఉండేది. దీంతో ఆమె వారందరికీ విడివిడిగా కిమోథెరపీ చేయించేది. ఈ క్రమంలో గీతా శ్రీధర్ చేస్తున్న సేవను చూసిన ఆమె స్కూల్ యాజమాన్యం రోజూ 2 క్లాస్‌లకు ఆమెకు మినహాయింపునిచ్చేవారు. దీంతో ఆమె నిత్యం రెండు క్లాస్‌లకు ముందే ఇంటికి వచ్చి ఆ పిల్లల సంరక్షణ చూసుకునేది. రాను రాను ఆమె వారి సంరక్షణ కోసం మరికొందరిని వాలంటీర్లుగా నియమించింది.
అలా గీతా శ్రీధర్ గత 7 ఏళ్లుగా ఆ 28 మంది పిల్లల్ని సంరక్షిస్తూ వస్తోంది. కాగా క్యాన్సర్ కారణంగా కొద్ది రోజులు మాత్రమే బతుకుతారనుకున్న పిల్లలు కూడా ఇప్పుడు హాయిగా, ఆరోగ్యంగా జీవిస్తున్నారు. ఇదంతా గీతా శ్రీధర్ చలవే అంటారు ఆ పిల్లలకు వైద్యం అందిస్తున్న హాస్పిటల్ డాక్టర్లు. నిజంగా ఆ పిల్లల పాలిట ఆమె దేవతే కదూ!

Comments

comments

Share this post

scroll to top