ట్రాఫిక్ లో డ్యూటీ చేస్తున్న పోలీసుల‌కు ఫ్రీగా మాస్కులు అందించిన గ‌జ‌ల్ శ్రీనివాస్…ఇప్పుడెందుకిలా ??

ఎన్నో సంవ‌త్స‌రాలు క‌ష్ట‌ప‌డి తెచ్చుకున్న పేరు, కీర్తి…ఒక్క క్ష‌ణంలో ప‌టాపంచ‌ల‌య్యాయి. సెలెబ్రిటీగా నీరాజ‌నాలు అందుకున్న టివి ఛాన‌ల్స్ లోనే ఒక్క‌సారిగా విల‌న్ అంటూ క‌నిపిస్తున్నాడు….. 126 భాషాల్లో గ‌జ‌ల్స్ పాడి గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డ్స్ ను అందుకున్న గ‌జ‌ల్ శ్రీనివాస్….కీచ‌క శ్రీనివాస్ అంటూ న్యూస్ బులెటిన్స్ కు హెడ్ లైన్స్ గా మిగిలిపోయాడు.!! లోప‌లి వ్య‌క్తి, బ‌య‌టి వ్య‌క్తి అంటూ అత‌ని లోని రెండు కోణాల మీద చ‌ర్చోప‌చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.! నిజానిజాలు ఎలా ఉన్న గ‌జ‌ల్ శ్రీనివాస్ ఓ ఇంట‌ర్వ్యూ ఇప్పుడు వైర‌ల్ గా మారింది.

ట్రాఫిక్ లో డ్యూటీ చేస్తున్న పోలీసుల‌కు 50 వేల రూపాయ‌ల‌ను వెచ్చించి మాస్క్ ల‌ను అందించింది గ‌జ‌ల్ శ్రీనివాసే …ఆ త‌ర్వాత ప్ర‌భుత్వం పోలీసుల‌కు మాస్క్ ల‌ను స‌ర‌ఫ‌రా చేయ‌డం స్టార్ట్ చేసింద‌ట‌.! అంతేకాదు…ట్రాఫిక్ మీద సాంగ్ కంపోజ్ చేస్తున్న స‌మ‌యంలో….గ‌జ‌ల్ కు సీట్ బెల్ట్ పెట్టుకునే అల‌వాటు ఉండేది కాద‌ట‌…దాని కార‌ణంగా షూటింగ్ ను రెండు నెల‌లు వాయిదా వేసి…సీట్ బెల్ట్ ను పెట్టుకోవ‌డం అల‌వాటు చేసుకున్నాన‌…మళ్లీ షూటింగ్ చేశాడ‌ట‌…మ‌నం పాటించంది ప‌క్కోళ్ళ‌కు చెప్ప‌డం త‌న‌కు న‌చ్చ‌దిని చెప్పుకొచ్చాడు శ్రీనివాస్…పాపం అలాంటి వ్య‌క్తి…ఇలా అడ్డంగా బుక్క‌వ్వ‌డం ఏంటో…!!

Watch Video:

This Is Peaks:

Traffic Song:

Comments

comments

Share this post

scroll to top