గజల్ శ్రీనివాస్ కేసులో బాధితురాలు ఇంటర్వ్యూ…కామెంట్స్ లో ఆ మంత్రిని తిడుతున్నారు.! ఎందుకో తెలుసా.?

నిన్నటి వరకు తన గజల్స్ తో అందరిని అలరించిన గజల్స్ శ్రీనివాస్ ఒక్కసారిగా తన వికృత రూపం బయటికి రావడంతో గలీజ్ శ్రీనివాస్ అయిపోయాడు..ఒకవైపు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న గజల్ వీడియోస్ చూసిన నెటిజన్లు ,టీవిల్లో చూస్తున్న వారు గజల్ కి వ్యతిరేఖంగా గలం విప్పుతుంటే కొందరు మాత్రం గజల్ ని సపోర్ట్  చేస్తున్నారు..గజల్ శ్రీని వాస్ అలాంటివాడు కాదు..అంటూ గజల్ చుట్టాలు చెప్తుంటే..మరోవైపు స్వయంగా మంత్రే గజల్ ని సపోర్ట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తున్నాయి…

గజల్ శ్రీనివాస్  అమ్మాయిలను వేధించే వాడు  కాదని దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు అన్నారు. గజల్ శ్రీనివాస్ ఎపిసోడులో కుట్ర కోణం ఉందని గజల్ శ్రీనివాస్ ను మంత్రి వెనుకేసుకొచ్చారు. గజల్ శ్రీనివాస్ చిన్నప్పటి నుంచి నాకు తెలుసని, చాలా చక్కటి, కమ్మటి పాటలు పాడతారన్నారు. దేశవ్యాప్తంగా తిరిగి చక్కటి గజల్స్ వినిపించారన్నారు. కుట్ర లేకుంటే కెమెరాలు ఎందుకు పెట్టారని ఆయన ప్రశ్నించారు…మంత్రి మాణిక్యాల రావు వ్యాఖ్యలపట్ల సోషల్ మీడియాలో సర్వత్రా వ్యతిరేకత వస్తుంది..సోషల్ యాక్టివిస్ట్ దేవి గారు మాణిక్యాలరావు మాటలను కొట్టిపారేయడమే కాదు..గజల్ పాటలు వేరు అతని ప్రవర్తన వేరు..ఈ అమ్మాయి చాలా ధైర్యంగా బయటపెట్టింది.. అలాంటప్పుడు ఆ అమ్మాయికి అండగా నిలబడాల్సింది పోయి ఈ విధంగా కుట్ర అంటూ కొట్టిపారేయడం చాలా నీచమైన చర్య అన్నారు..అయితే యూట్యూబ్ లో మాణిక్యాల రావు మాటలకు నెటిజన్లు బూతులు తిడుతున్నారు..

ఇదిలా ఉండ‌గా…మంత్రి మాణిక్యాల రావు త‌న మాట‌ల‌ను వెనక్కి తీసుకున్నారు:
గ‌జ‌ల్ ను స‌మ‌ర్థిస్తూ నేను మాట్లాడిన మాట‌ల‌కు నేనే సిగ్గు ప‌డుతున్నాను..నా వ్యాఖ్య‌ల‌ను వెన‌క్కి తీసుకుంటున్నాను. గ‌జ‌ల్ శ్రీనివాస్ లో ఇన్నాళ్లు నాణానికి ఒక‌వైపే చూశాను… ఈ విధంగా ప్ర‌వ‌ర్తించే వ్య‌క్తి అనుకోలేదు. ఇటువంటి వ్యక్తులు సమాజంలో ఉండకూడదు
గజల్ శ్రీనివాస్ పై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు మంత్రి మాణిక్యాల రావు.

watch video here:

అయితే ఒక అమ్మాయి ఎంత కష్టపడకపోతే ఈ విధంగా బయటపడదు..ఇలా బయటపడడం అంటే ఒక విధంగా తన జీవితాన్ని కూడా బయట పెట్టుకోవడమే..అయినప్పటికీ కూడా వాటన్నింటికి ధైర్యంగా నిలబడి ,ఆ నరకాన్ని భరించలేక ఈ విధంగా సాక్ష్యాలతో సహా బైట పెట్టినప్పుడు నీకు మేమున్నాం అని భరోసా ఇవ్వకపోయినా ,ఇది కావాలని చేసిన కుట్ర అనే మాటలు మరింత భయపెడతాయి.. వీటన్నింటిని అరుణ ధైర్యంగా ఎదుర్కోవాలని ,ఆమెకు న్యాయం జరగాలని కోరుకుందాం..

Comments

comments

Share this post

scroll to top