యాక్సిడెంట్ లో గాయపడ్డ యువతిని ఆసుపత్రికి తీసుకెళ్ళారు..అప్పటికే చనిపోవడంతో ఏం చేసారో తెలుసా.?

మాయమై పోతున్నడమ్మా … మనిషన్న వాడు
ఓ ఓ ఓ …  మచ్చుకైనా లేడు… చూడు
మానవత్వము ఉన్నవాడు.. ఇప్పుడు ఈ వార్తకి ఈ మాటలు ఖచ్చితంగా సూట్ అవుతాయి.అంతేకాదు శవాలపై చిల్లర ఏరుకోవడం అనే మాటలు మీరు వినే ఉంటారు కదా..సరిగ్గా అదే పని చేసాడు ఒకడు.చావు బతుకులతో పోరాటున్న యువతిని కాపాడినట్టే కాపాడి..చనిపోయిందని తెలియగానే ఆ యువతి దగ్గరున్న డబ్బంతా తీసుకుని ఉడాయించాడు.మానవత్వం అనేది లేకుండా పోతుందనడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే.ఇలాంటివి రోజు మనం అనేకం చూస్తున్నాం.
శిఖాసింగ్ అనే యువతి టీచర్ గా పనిచేస్తుంది.స్కూల్ కి వెళ్తుండగా దారిమధ్యలో యాక్సిడెంట్ కావడంతో తీవ్రంగా గాయపడింది.దాంతో పక్కనే ఉన్న నలుగురు యువకులు ఆమెను హాస్పటల్ కి తీసుకెళ్లారు.వారిలో ఇద్దరే సోలంకి రామ ప్రసాద్,అతడి స్నేహితుడు ప్రదీప్.దీంతో అక్కడున్న వాళ్లంతా వైధ్యం అందితే బతుకుతుందిలే..ఆపదలో ఆదుకున్నారంటూ మనసులోనే వారికి థ్యాంక్స్ చెప్పుకున్నారు.తీరా హాస్పటల్ కి వెళ్లాక చనిపోయిందని డాక్టర్లు చెప్పారు .కనీసం ఆమె కుటుంబ సభ్యులకు కూడా చెప్పకుండా ఆమెకు సంబంధించిన క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, ట్యాబ్, మొబైల్, పర్స్ అన్నీ తీసుకొని వెళ్ళిపోవడం దారుణం.ఈ ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది..
 యాక్సిడెంట్ తర్వాత ఆ వస్తువులు కనిపించకపోవడంతో ఈ విషయమై పోలీసులను సంప్రదించారు ఆమె తరపువారు. సైబర్ క్రైమ్ పోలీసులు ఆమె మొబైల్ ను ట్రేస్ చేసి రామప్రసాద్ ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అరెస్ట్ చేయడానికి ముందే చిన్న గొడవలో ప్రదీప్ చనిపోయాడు. రామప్రసాద్ ఆమె మొబైల్ మొత్తాన్ని ఫార్మాట్ చేసేశాడు. ఆమె అకౌంట్ లో ఉన్న డబ్బులను పేటీఎమ్ ద్వారా 13,290 రూపాయలను బయటకు తీసి వాడుకున్నారు. మానవత్వం అనేదే లేకుండా ప్రవర్తించిన వీళ్ళను ఏమనాలి.

Comments

comments

Share this post

scroll to top