ఇతనిది బుర్ర కాదు, అద్భుత ఆలోచనల పెట్టె.! సాప్ట్ వేర్ కొలువును కాదని సమాజహితం కోసం నడుం కట్టిన శ్రీమంతుడు.

ఇంజనీరింగ్ అవ్వగానే పెద్ద కార్పోరేట్ కంపెనీ పిలిచి జాబిస్తామంటే ఎవ్వరు మాత్రం కాదంటారు చెప్పండి.!? ఎగిరి గంతేసి తెల్లారికల్లా వెళ్లి అపాయింట్మెంట్ ఆర్డర్  తెచ్చుకొని, ఫ్రెండ్స్ తో  పార్టీ వేడుకల్లో మునిగి తేలుతుంటారు. కానీ  ఈ కుర్రాడు మాత్రం అలాంటి బాపతు కాదండి….. నాలుగు గొడల మద్య జాబ్ చేస్తే ఎముంది నా కిక్కు.. లైఫ్ ను ఓ డిఫరెంట్ యాంగిల్ లో చూడాలి, అందులోనూ ఇంత చదువు చదివి సమాజానికి ఉపయోగపడకపోతే ఎందుకా చదువు .? మనిషి పుట్టుకకు, చదివిన చదువుకు  ఓ పరమార్థం ఉండాలి కదా అంటాడు.

అవును…….. ఓ పెద్ద వేదాంతిలా ఈ యంగ్ సైంటిస్ట్ పేరు గట్టు శ్రవణ్. ఇతని గురించి పరిచయం కావాలంటే మెదక్ జిల్లాలోని ఏ రైతును అడిగినా ఠక్కున చెప్పేస్తారు. ఎందుకంటే  … వర్షం పడుతుందా..? చేనులో చల్లిన విత్తనం బతుకుతుందా?  పంట నిలుస్తుందా..? అనే దిగులు పడుతున్న రైతులకు తాను శోధించి రూపొందించిన ఆర్గానిక్ ఫెస్టిసైడ్ తో భరోసా ఇచ్చాడు. ఇతని బుర్ర నిండా ఆలోచనలే… నిత్యం సమాజానికి ఉపయోగపడే అంశాలపై పరిశోధనలే.!

12498919_890935394352539_30693296_n

ఇప్పటి వరకు 250 కు పైగా పరిశోధనలు చేసిన శ్రవణ్, 56 ప్రయోగాలకు ఫేటెంట్ హక్కులు కూడా పొందాడు.
తన  ఆవిష్కరణలతో సమాజానికి మేలు చేయాలన్నదే తన అభిమతం…

మండిపోతున్న ఎండాలకు బైక్ ల మీద ప్రయాణం చేసే వాళ్లకు వరం… శ్రవణ్ రూపొందించిన AC హెల్మెట్.. ఎటువంటి గ్యాస్ లను ఉపయోగించకుండా అతడు రూపొందిచింన AC  హెల్మెట్ ఓ సరికొత్త ఆవిష్కరణ.  చిటికెలో కార్ల టైర్లలోకి గాలిని నిపండం, బటన్ నొక్కితే జాకీ కార్ ను లేపడం….ఇలాంటి అనేక ఆవిష్కరణలు చేశాడు శ్రవణ్. మెకానిక్ ఇంజనీరింగ్ చదివిన శ్రవణ్ కు ఎన్నో కార్పోరేట్ కంపెనీలు బారీ ఫ్యాకేజ్ లను ప్రకటించి మా కంపనీలలో చేరండీ అంటూ జాయినింగ్ ఆర్డర్స్ పంపినా ..? నో…నేనూ, నా పరిశోధనలు సమాజానికే అంకితం అంటూ పూర్తి ఆత్మ విశ్వాసంతో చెబుతాడీ యంగ్ సైంటిస్ట్.

12884361_890935411019204_1288600523_n

అంతా ఓకే కానీ…. మన దగ్గరున్న ఆణిముత్యాలను మనమెందుకు గుర్తించలేకపోతున్నామో అర్థం కాని పరిస్థితి.! మన తెలుగు రాష్ట్రాల్లోని పంటలు ఎక్కువగా వర్షాదారాలు…సో….ఇతడు ఆవిష్కరించిన  ఆర్గానిక్ పెస్టిసైడ్  మొక్కకు మూడు నెలలు నీళ్లు అందించకున్నా అది ఎదిగేలా చేసే సామర్థ్యం ఉంది. అలాంటప్పుడు ప్రభుత్వాలు ఇతనిని ఇతని పరిశోధల్ని మరింతగా ప్రోత్సాహిస్తే ఆద్బుత ఫలితాలు వెలువడుతాయి. దానికి తోడు రైతుల జీవితాలు కొత్త వెలుగులతో నిండుతాయి.

Watch Video:

Comments

comments

Share this post

scroll to top