గత 22 ఏళ్లనుండి ఆ జంట “మ్యాన్ హోల్” లోనే ఉంటున్నారు..! ఎందుకో తెలుసా.? లోపల ఎలా ఉందో చూస్తే షాక్ అవుతారు.!

చనిపోయాక ప్రతి మనిషి ఆరడుగుల స్థలం సరిపోతుంది..కానీ బతికున్నప్పుడు ఉండడానికి మాత్రం పెద్ద ఇల్లు కావాలి..కానీ ఒక జంట ఇరవై రెండేళ్లుగా చిన్న గుంటలో జీవనం సాగిస్తున్నారు.వాళ్లు కలిసిన పరిస్థితే అనూహ్యంగా జరిగితే ఆ గుంటలో వారు తీసుకున్న నిర్ణయం మాత్రం అందరికి ఆదర్శంగా నిలుస్తుంది.ఇంతకీ వారు తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా డ్రగ్స్ మానేయాలని..డ్రగ్స్ మానేయడానికి వారు ఆ గుంటలో నివసించడానికి అసలు రీజన్ ఏంటో తెలుసా..

మనిషి తలుచుకుంటే సాధించలేనిదంటూ ఉండదు.డ్రగ్స్ కి అలవాటు పడిన ఇద్దరు వ్యక్తులు అనుకోకుండా ఒకరోజు వారిద్దరూ డ్రగ్స్ మత్తులో ఒక గుంత లాటి ప్రదేశంలో కలిశారు.అప్పటికి వారిద్దరూ డ్రగ్స్ కి పూర్తిగా బానిసలయి ఉన్నారు.,డ్రగ్స్ లేకుండా బ్రతకలేనంతగా మారిన వారిద్దరూ తొలిచూపులోనే ప్రేమలో పడ్డారు అంతేకాదు వారి ఇష్టాఇష్టాలు కూడా కలవడంతో..తమని కలిపిన ఆ గుంతలో సహజీవనం స్టార్ట్ చేసారు వారే మ్యుగేల్,మరియా..కలిసి బతకాలనే నిర్ణయం మాత్రమే కాదు అప్పటికే పీకల్లోతు డ్రగ్స్ మత్తులో మునిగిన వారిద్దరూ ఆ వ్యసనాన్ని వదిలించుకోవాలనుకున్నారు. అప్పటి నుండి ఆ గుంతలోనే కలిసి ఉంటున్నారు.

ఇప్పటికి వారు ఆ గుంటలో జీవించడం మొదలయ్యి 22 సంవత్సరాలు అవుతోంది. ఆ గుంటని వారు తమ ఇల్లుగా మలుచుకున్నారు.వంటకి కావాల్సిన సామాన్లు,ఒక టీవీ,ఒక లాకర్ ఇలా కొన్ని వస్తువులు కూడా ఉన్నాయి .. ఇంతకుముందు ఉద్యోగం చేసిన భర్త లివర్ పాడయిపోవడంతో ఇప్పుడు ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండగా అక్కడే నివసిస్తున్న కొందరు వారికి అప్పుడప్పుడు సహాయ పడుతూ ఉంటారు.ఎన్ని కస్టాలు వచ్చినా వారు ఆ గుంటని తమ ప్రేమని వదలలేదు.మరణించే వరకు అక్కడే ఉంటామని వారు నిక్కచ్చిగా చెప్తారు…

మనిషి వ్యసనాలకు బానిసయ్యేది ఎప్పుడూ ..జీవితంలో సరైన తోడు లేనప్పుడో,మార్గనిర్దేశం చేసిన వారు లేనప్పడో..అలాంటి పరిస్తితుల్లో మత్తుని తోడుగా భావించిన వీరిద్దరూ ఒకరికొకరు తోడయ్యాక ఆ వ్యసనాన్ని జయించారు.అంతేకాదు 22ఏళ్లుగా వారు డ్రగ్స్ తీసుకోలేదు..ఆ గుంతని వదిలిపెట్టలేదు..

Comments

comments

Share this post

scroll to top