వాంతులు, విరేచ‌నాలు, క‌డుపునొప్పికి స‌రైన చికిత్స‌.! ఈ 5 వ‌స్తువులు.!!

వాంతులు, విరేచ‌నాలు, తీవ్రమైన క‌డుపునొప్పి, ఆక‌లి లేక‌పోవ‌డం… ఇవ‌న్నీ ‘గ్యాస్ట్రో ఎంట‌రైటిస్ (Gastroenteritis)’ ల‌క్ష‌ణాలు. కొన్ని సార్లు ఇవ‌న్నీ ల‌క్ష‌ణాలు ఉండ‌క‌పోవ‌చ్చు. కేవ‌లం వాంతులు, ఆక‌లిలేక‌పోవ‌డం వంటి ల‌క్ష‌ణాలే ఉండ‌వ‌చ్చు. ఇది వ‌స్తే వైద్యుని చికిత్స మేర‌కు మందుల‌ను వాడుకోవాలి. కొద్ది రోజుల వ‌ర‌కు డైట్ నియ‌మాలు పాటించాలి. దీంతో ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. అయితే ఇవే కాకుండా కింద ఇచ్చిన ప‌లు సూచ‌న‌లు పాటిస్తే దాంతో ఈ అనారోగ్య స‌మ‌స్య నుంచి త్వ‌ర‌గా కోలుకోవ‌చ్చు. ఆ ల‌క్ష‌ణాలు కూడా త‌గ్గుముఖం ప‌డ‌తాయి. ఆ సూచ‌న‌లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. తేనె
ఒక క‌ప్పు గోరువెచ్చ‌ని నీటిలో ఒక టీస్పూన్ తేనె క‌లుపుకుని ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున తాగాలి. ఇలా తాగ‌డం వ‌ల్ల వాంతులు, విరేచ‌నాలు త‌గ్గుతాయి. తేనెలో ఉండే యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ వైర‌ల్ గుణాలు క‌డుపులో ఉండే చెడు బాక్టీరియా, వైర‌స్‌ల‌ను చంపుతాయి. దీంతోపాటు శ‌రీరానికి పొటాషియం గ్ర‌హించే శ‌క్తి పెరుగుతుంది. దీంతో శ‌రీరం ఎల్ల‌ప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంటుంది. గ్యాస్ట్రో ఎంట‌రైటిస్ త‌గ్గుతుంది.

2. చ‌క్కెర, ఉప్పు
ఒక లీట‌ర్ నీటిలో 8 టీస్పూన్ల చ‌క్కెర‌, అర టీస్పూన్ ఉప్పును బాగా క‌ల‌పాలి. ఇందులోంచి 200 ఎంఎల్ ద్రావ‌ణం చొప్పున రోజులో 5 సార్లు తాగాలి. ఇలా చేస్తే విరేచ‌నాలు త‌గ్గుతాయి. వాంతి కాకుండా ఉంటుంది. శ‌రీరంలో ద్ర‌వాలు స‌మ‌తుల్యంలో ఉంటాయి.

rice-water

3. గంజి నీళ్లు
అన్నం వండేట‌ప్పుడు వ‌చ్చే గంజి నీళ్ల‌లో చిటికెడు ఉప్పు క‌లుపుకుని తాగుతుంటే గ్యాస్ట్రో ఎంట‌రైటిస్ స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. పెద్ద‌ల‌కే కాదు, పిల్ల‌ల‌కూ ఈ చిట్కా ప‌నిచేస్తుంది. దీంతో విరేచ‌నాలు త‌గ్గుతాయి. శ‌రీరానికి శ‌క్తి అంది నీర‌సం త‌గ్గుతుంది.

4. చేమ దుంపలు
చేమ దుంప‌లను బాగా ఉడ‌క‌బెట్టి న‌ల‌పాలి. ఆ మిశ్ర‌మంలో పాలు, మజ్జిగ లేదా పెరుగు వంటి డెయిరీ ఉత్పత్తుల‌ను క‌లిపి తీసుకోవాలి. దీంతో వాంతులు, విరేచ‌నాలు ఆగుతాయి. జీర్ణాశయం, పేగుల్లో మంచి బాక్టీరియా త్వ‌ర‌గా వృద్ధి చెందుతుంది. గ్యాస్ట్రో ఎంట‌రైటిస్ స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

curd

5. పెరుగు
గ్యాస్ట్రో ఎంట‌రైటిస్ స‌మ‌స్య ఉన్న‌న్ని రోజులూ ప్ర‌తి రోజు ఆహారంలో గ‌డ్డ పెరుగు తినాలి. దీంతో ఈ అనారోగ్య స‌మ‌స్య నుంచి త్వ‌ర‌గా ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు. ఈ క్ర‌మంలో జీర్ణ స‌మ‌స్య‌లు కూడా పోతాయి. జీర్ణాశ‌యం, పేగుల్లో మంచి బాక్టీరియా వృద్ధి చెందుతుంది.

Comments

comments

Share this post

scroll to top