గరుడ పురాణం ప్రకారం ఆడవారు ఈ 4 తప్పులు చేస్తే ఎలాంటి శిక్షలు ఉన్నాయో తెలుసా..?

మనిషి నాలుగు కాలాలపాటు సుఖ సంతోషాలతో పిల్లా పాపలతో జీవించాలని మన పూర్వీకులు అనేక నియమ నిష్ఠలను ఆచారాల పేరుతోనో, సాంప్రదాయాల పేరుతోనో ఆచరణలో పెట్టారు. ఇలా క్రమబద్ధమైన సంఘ జీవితంతోనే మానవాళి మనుగడ సుదీర్ఘ కాలం కొనసాగుతుందని వారు నమ్మారు. అలా చెప్పిన విషయాలెన్నో పురాతన గ్రంథాల్లో నిక్షిప్తమై ఉన్నాయి. అందులోనే ఒకటి ఇది. గరుడ పురాణం ప్రకారం ఆడవాళ్ళు ముఖ్యంగా నాలుగు పనులు అసలే చేయకూడదట. అప్పుడు మాత్రమే కుటుంబంలోనూ, సమాజంలోనూ ఆడవారికి తగిన ప్రాధాన్యత లభిస్తుందని ఆ పురాణాల సారాంశం. కాలంతో పాటు వేగవంతమైన మార్పులు సంభవిస్తున్నా ఇప్పటికీ మన ప్రాచీన గ్రంథాలు, వాటిల్లోని విషయాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. విదేశీయులు సైతం ఫిదా అయిన కుటుంబ వ్యవస్థ మనది. ఇంతకీ గరుడ పురాణం చెప్పిన ఆడవాళ్లు చేయకూడని నాలుగు తప్పులు ఏంటో తెలుసుకుందాం..

దూరంగా ఉండడం:

ఏ స్త్రీ కూడా భర్త నుంచి ఎక్కువ కాలం దూరంగా ఉండకూడదు. దూరంగా ఉండడం వల్ల వారు మానసికంగా, శారీరకంగా కుంగి పోతారు. భర్త దగ్గర ఉంటే వీరికి భద్రత ఉంటుంది. సమాజం నుంచీ తగిన గౌరవం లభిస్తుంది. దూరంగా ఉంటే రక రకాల సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది.

చెడ్డ వారితో స్నేహం :

ఆడవాళ్ళు ఎప్పుడూ చెడు స్నేహాలు చేయరాదట. అలా అని మగవాళ్లు చేస్తే తప్పేంలేదని కాదు. కాని ఇది ఆడవాళ్లకు ఉద్దేశించి చెప్పిన విషయాలుగానే చూడాలి. చెడు ప్రవర్తన కలిగిన వారు ఎదుటివారందరితోనూ తప్పుడు ప్రవర్తన కనబర్చినట్లే ఏదో ఒక రోజు మీతోనూ అలాగే చేసే ప్రమాదం ఉంటుందని గరుడ పురాణం హెచ్చరిస్తోంది. అందరికీ బాధ కలిగించినట్లే మీకు కూడ బాధను మిగులుస్తారని హెచ్చరిస్తోంది. అందుకే ఎప్పుడూ చెడ్డ వారితో స్నేహం మంచిదికాదని హెచ్చరిస్తోంది.

గౌరవం :

అదే విధంగా పెద్దవారితో ఎప్పుడూ మర్యాద పూర్వకంగా ఉండాలి. మాటల్లోనూ, చేతల ద్వారా వాళ్ళను కించ పరచరాదు. కుటుంబ సభ్యులను ఎప్పుడూ తక్కువ చేసి మాట్లాడరాదు. ఇలా చేస్తే ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారు.

వేరేవారి ఇంట్లో:

స్త్రీలు ఎప్పుడూ పరాయి వాళ్ళ ఇండ్లలో ఉండరాదు. ఎంతటి కష్టం వచ్చినా తమ ఇంటిలోనే ఉండాలి. ఇలా ఉండడం వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. చులకన భావం, అమర్యాద, అసభ్యత, నిర్లక్ష్యం ఇలా ఎన్నో ఇబ్బందులు తప్పవని గరుడ పురాణం చెబుతోంది.

Comments

comments

Share this post

scroll to top