అల్లం, వెల్లుల్లి పేస్ట్ తో చంపేస్తారు! అంతా మాయ…ఆరోగ్యాలతో ఆట.!

కత్తులతో ,కంటి చూపులతో చంపేరోజులు నుండి ఇంట్లో  రోజువాడే వంట నూనె తో, బేకరీ షాపుల్లోని టమోటా సాస్ తో, వంటల్లో ఘుమఘుమ ల కోసం వాడే అల్లం వెల్లులితో  చంపే రోజులు వచ్చాయ్.  వినడానకి ఆశ్చర్యంగానే ఉండొచ్చు, కానీ ఇది నిజంగా నిజం.అక్రమార్జనే ధ్యేయంగా చెలరేగుతున్న దుర్మార్గుల  వల్ల,  వంటింటే పదార్థాలను చూస్తే విషాన్ని చూసిన ఫీలింగ్ కలుగుతుంది.

ginger-garlic-paste

 హైద్రాబాద్ లో  వెలుగు చూసిన  కల్తీ అల్లం వెల్లులి వ్యాపారం:

తాజాగా హైద్రాబాద్ లో కల్తీ అల్లం వెల్లుల్లి తయారీ బయటపడింది, ఈ కల్తీ అల్లం వెల్లుల్లి  తయారీ  దారుడిని పట్టుకుని విచారిస్తే కళ్ళు తిరిగే నిజాలు బయటపడ్డాయి. లాభార్జనే ధ్యేయంగా ఎంత నీఛానికి దిగజారాడో తెలిసింది.  అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారికి  కామన్ గా 60% వెల్లుల్లి,  40 % అల్లం వాడతారు.  అవసరాన్ని బట్టి ఈ మోతాదు లో కాస్త  అటు, ఇటు గా మారుతుంది. కానీ  40 శాతం కలపాల్సిన అల్లం స్థానంలో కేవలం 5 శాతమే కలిసి మిగతా దానికి బదులుగా సిట్రిక్ ఆమ్లంను కలిపేసాడు ఈ అక్రమ తయారీదారుడు.

ginger paste kaltee

నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను తయారు చేస్తున్నాడనే సమాచారంతో రైడ్ కు దిగిన పోలీసులు అతనిని నుండి 900 కిలోల నకిలీ పేస్ట్‌తో పాటు అందులో ఉపయోగించే ముడి పదార్ధాలు, రసాయన పదార్ధాలను,  40 బాటిల్స్‌లలో ఉన్న సిట్రిక్ ఆమ్లంను  పోలీసులు స్వాధీనం చేసుకొని తయారీదారుడిని అరెస్టు చేశారు.

ginger paste

ఇదే అల్లం వెల్లుల్లి పేస్ట్ ను ఛాయిస్ గోల్డ్ పేరుతో 100,200,500 గ్రాముల డబ్బాలలో నింపి ఈ పాటికే కోట్లలో వ్యాపారం చేశాడు సదరు వ్యక్తి!  పరిగెడుతున్న కాలంతో పోటీ పడలేక అన్నీ రెడీమెడ్ కు అలవాటైన మన బలహీనతను సొమ్ము చేసుకునే ఇటువంటి కల్తీ పదార్తాల తో   జాగ్రత్తగా ఉందాం!

CLICK: బెడ్ రూమ్ సీన్లు స్మార్ట్ ఫోన్లో, అవమానం తట్టుకోలేక దంపతుల ఆత్మహత్య.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top