మారుమూల ప‌ల్లె నుండి అంత‌ర్జాతీయ పోటీకి… ఈ క‌వ‌ల‌లు- క‌రాటే వీరులు.

మారుమూల ప‌ల్లెటూరు, రెక్కాడితే కానీ డొక్కాడ‌ని జీవితాలు….కానీ చిన్న‌ప్పటి నుండే ఆ క‌వ‌ల‌ల ల‌క్ష్యం వేరు. త‌మ‌కోసం రెక్క‌లు ముక్క‌లు చేసుకుంటున్న త‌ల్లిదండ్రుల‌కు, త‌మ ఊరికి పేరు తేవాల‌ని నిరంత‌రం త‌పిస్తూనే ఉన్నారు…అదిగో ఆ త‌ప‌నే ఇప్పుడు ఈ క‌వ‌ల‌ల‌ను మీకు ప‌రిచ‌యం చేసేలా….గ‌ర్వంగా చెప్పుకునేలా చేసింది.

ఎక్క‌డో మ‌హ‌బూబాబాద్ జిల్లా లోని గార్ల మండ‌లం జీవంచిప‌ల్లి లో పుట్టిన ఈ క‌వ‌ల‌లు( భ‌రత్, మేఘ‌న్) ఇప్పుడు కొలొంబోలో జ‌రిగే అంత‌ర్జాతీయ క‌రాటే పోటీల‌లో పాల్గొన‌నున్నారు. గ‌తంలో కూడా ఈ క‌వ‌ల‌లు అనేక పోటీల్లో పాల్గొని ప‌త‌కాల పంట పండించారు. రీసెంట్ గా ఉత్త‌రాఖండ్ లో జ‌రిగిన జాతీయ అండ‌ర్-19 క‌రాటే పోటీల్లో పాల్గొన్న వీరు…..8 రాష్ట్రాల ప్ర‌త్య‌ర్థులను ఓడించి గోల్డ్ మెడ‌ల్ సాధించారు.

ఈ ఘ‌న‌త‌ను కాస్త ప‌క్క‌కు పెట్టి….ఒక్క‌సారి వారి కుటుంబ ప‌రిస్థితిని గురించి, వారు ఎదిగిన క్ర‌మం గురించి మాట్లాడుకుందాం….ఎందుకంటే విజ‌యాలు వాటంత‌ట అవే రావు ….. ఎన్నో త్యాగాలు, ఎంతో శ్ర‌మ, అకుంఠిత దీక్ష ఉంటేనే వ‌స్తాయ‌నేది వీరి జీవిత‌మే ఉదాహ‌ర‌ణ‌.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాలు చూసి క‌రాటే మీద మ‌క్కువ పెంచుకున్న ఈ క‌వ‌ల‌లు….ఎలాగైనా త‌మ‌కంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాల‌ని తాప‌త్రయ ప‌డ్డారు… యూట్యూబ్ లో క‌రాటే వీడియోలు చూస్తూ ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు. అదే వాళ్ల లోకం అయ్యింది. ఓ ప‌క్క ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో చ‌దువుతూ….మ‌రోవైపు త‌మ‌కిష్ట‌మైన క‌రాటేను వ‌ద‌ల‌కుండా నిరంత‌ర సాధ‌న‌లో ఉండేవారు. వీరిని చూసి …ఆ…..ఆ క‌రాటే ఏమైనా తిండి పెట్టేదా? అని ఈస‌డించుకున్న వారూ ఉన్నారు.!! కానీ వారు మాత్రం త‌మ ల‌క్ష్యాన్ని వీడ‌లేదు..అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు అంత‌ర్జాతీయ పోటీల్లో పాల్గొన‌డానికి సిద్దం అవుతున్నారు. త‌మ‌కు తెలిసిన క‌రాటే విద్య‌ను త‌మ చుట్టూ ఉన్న 3,4 స్కూల్ విద్యార్థుల‌కు ఉచితంగా నేర్పిస్తున్నారు. మ‌న‌ల్ని మ‌నం ర‌క్షించుకునే విధాన‌మే క‌రాటే, దీనిని అంద‌రూ నేర్చుకొవాలంటున్నారు…ఈ క‌వ‌ల‌లు.

సింధు ఒలంపిక్స్ లో ర‌జ‌తం సాధించిన త‌ర్వాత కోట్లు కుమ్మ‌రించిన పెద్ద‌లు….ఇదిగో రేప‌టి ప‌త‌క ఆశాకిర‌ణాలు వీరే…ఇలాంటి వారిని ఇప్ప‌టి నుండే ప్రోత్సాహించండి… వెన్ను త‌ట్టాలే కానీ…గోల్డ్ మెడ‌ల్ ను తీసుకొచ్చి భ‌ర‌త‌మాత మెడ‌లో వేయ‌డానికి వీరు సిద్దంగా ఉన్నారు. అస‌లే పేద కుటుంబం..దానికి తోడు క‌రాటే అంటే దేహ‌ధారుడ్యం పై ఫోక‌స్ చేయాలి..పైగా కొలొంబో వెళ్లాలి.
వీట‌న్నింటిని దృష్టిలో ఉంచుకొని ఎవ‌రైనా దాత‌లు ముందుకొచ్చి వీరికి అండ‌గా నిల‌బ‌డితే……క‌రాటే లో దేశ ఖ్యాతిని విస్త‌రించేందుకు అవ‌కాశం ఉంది.
#ఆల్ ది బెస్ట్ ట్విన్స్- యు విల్ బి రాక్.

Comments

comments

Share this post

scroll to top