బైక్ ను తన్నిన ఇన్స్ పెక్టర్, గర్బిణి మృతి..! అసలేమైందో తెలుస్తే మీకు తప్పక కోపమొస్తుంది..!

సాధారణ ప్రజల విషయంలో పోలీసుల ఆగడాలకు అంతు లేకుండా పోతుంది.తమిళనాడులో ఒక ట్రాఫిక్ పోలీసు చేసిన నిర్వాకానికి గర్భిణి ప్రాణం కోల్పోయింది.హెల్మెట్ లేదనే కారణం చేత వేటాడి,వెంటాడి మరీ గర్భిణి ప్రాణం పొట్టన పెట్టుకున్నాడు ఒక ట్రాపిక్ పోలీసు. దాంతో ఆగ్రహించిన స్థానికులు రహదారిని దిగ్బందం చేయడమే కాదు,పై అధికారులు వచ్చి స్పందించే వరకు వాహనాలు ధ్వంసం చేశారు..నాలుగు గంటల పాటు జాతీయ రహదారిని దిగ్బందినం చేసిన ఈ ఘటన పూర్తి వివరాలు..

తమిళనాడులోని తిరుచ్చికి సమీపంలోని తువ్వకూడిలో నివసిస్తున్నారు  రాజ – ఉష దంపతులు.ఇద్దరూ చిన్ని చిన్న ఉద్యోగాలు  చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అదే విధంగా ఒక రోజు  రాత్రి వీరు  తిరుచ్చి – తంజావూరు నేషనల్ హైవేలో బైక్ పై వెళుతున్నారు. తువ్వకూడు టోల్ ప్లాజా దగ్గర పోలీసులు చెకింగ్ చేస్తున్నారు. రాజాకి హెల్మెట్ లేదు.దాంతో పోలీసులను తప్పించుకుని ముందుకు వెళ్లాడు.. ఈ విషయాన్ని గమనించిన ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ కామరాజ్.. వారిని ఆపే ప్రయత్నం చేశారు. రాజా బైక్ ను ఆపలేదు.హెల్మెట్ పెట్టుకోకపోవడం వారి తప్పే,బైక్ ఆపకపోవడం కూడా తప్పే కాని దానికి  ఫొటోలు తీసి చాలానా వేస్తే సరిపోయేది.కాని తమను చూసి కూడా ఆపకుండా వెళ్లారనే కారణంతో పోలీస్ కామరాజ్ కు కోపం వచ్చింది. వెంటనే పోలీస్ బైక్ పై వారి వెంటపడ్డాడు. బండి ఆపాలంటూ వార్నింగ్ ఇచ్చాడు. రాజా వినలేదు..వాళ్లకి దొరక్కూడదని బండిని ఫాస్ట్ గా పోనిచ్చాడు. దీంతో వేగంగా వెళుతున్న రాజా బైక్ ను కాలుతో తన్నాడు. దాంతో వారు రోడ్డుపై పడ్డారు. బైక్ పై వెనక కూర్చున్న భార్య ఉష రోడ్డుపై పడింది. తలకి బలమైన గాయం అవ్వడంతో ఉష స్పాట్ లోనే చనిపోయింది.ఉష  మూడు నెలల గర్భిణి.

ఎంతో కాలంలో ఈ రూట్ లో పోలీసులు చలానాలతో వేధిస్తున్నారని స్థానికులు ఇప్పటికే పోలీసుల పట్ల గుర్రుగా ఉన్నారు.ఈ ఘటనతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలిసి చుట్టు పక్కల గ్రామాల నుంచి 4వేల మంది తరుచ్చి – తంజావూర్ జాతీయ రహదారిని నిర్భందించడమే కాదు.రోడ్డుపై  వాహనాలను ధ్వంసం చేశారు.దాంతో ఉన్నతాధికారులు స్పాట్ కు వచ్చి ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ కామరాజ్ ను సస్పెండ్ చేసి.. కేసు నమోదు చేశారు. బాధిత కుటుంబానికి నష్టపరిహారం ఇస్తామని హామీ ఇవ్వటంతోపాటు ట్రాఫిక్ పోలీసులపై చర్యలు తీసుకుంటామని చెప్పటం ఆందోళన విరమించారు.

Comments

comments

Share this post

scroll to top