గర్భిణిని చంపేశాడు అతను…పక్కింట్లో ఉండే అతన్ని ఆమె ఏమడిగిందో తెలుసా.?

పెళ్లి చేసుకోవ‌డ‌మ‌నేది జీవితంలో చాలా ముఖ్య‌మైన విష‌యం. ఏ వ్య‌క్తికైనా పెళ్లి అనేది చాలా ముఖ్య‌మైన సంద‌ర్భం. జీవితంలో అనేక మందికి చాలా ఒక్క‌సారే వ‌స్తుంది. అయితే చాలా మంది పెళ్లి చేసుకుంటారు కూడా. కానీ కొంద‌రు మాత్రం ప‌లు కార‌ణాల వ‌ల్ల వివాహానికి దూరంగా ఉంటారు. అలాంటి వారిని పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్ అని ఎవ‌రైనా అడిగితే ఇక వారికి కోపం రావ‌డం కూడా స‌హ‌జ‌మే. కానీ ఆ వ్య‌క్తికి మాత్రం కోపం కాదు, ప‌ట్ట‌రానంత ఆగ్ర‌హం వ‌చ్చింది. దీంతో ఏకంగా ఓ నిండు గ‌ర్భిణిని చంపేశాడు. అస‌లు.. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే…

అది ఇండోనేషియా.. అక్క‌డ నివాసం ఉండే ఫైజ్ నూర్దిన్ అనే వ్య‌క్తి వ‌య‌స్సు 28 సంవ‌త్స‌రాలు. అయితే ఇంకా అత‌నికి పెళ్లి కాలేదు. దీంతో అత‌ని పొరుగున నివాసం ఉండే వారు పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్ అని అత‌న్ని అడిగేవారు. అందుకు అత‌ను స‌మాధానం దాట‌వేసేవాడు. అలాగే ఆ పొరుగు ఇండ్ల‌లో ఒకావిడ అయిన ఐసియా అనే ఆమె కూడా ఫైజ్‌ను ఎప్పుడూ పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్ అని అడిగేది. అందుకు ఫైజ్ స‌మాధానం చెప్పేవాడు కాదు. అయితే ఐసియా గ‌ర్భం దాల్చింది. నిండు గ‌ర్భిణీ అయింది. ఈ క్ర‌మంలో అప్పుడ‌ప్పుడు ఫైజ్ ఆమె ఇంటికి వ‌చ్చేవాడు. ఆమె కుటుంబ స‌భ్యుల‌తో అత‌నికి సాన్నిహిత్యం ఉండేది. అందుకే ఫైజ్ ఆమె ఇంటికి వ‌చ్చేవాడు.

అలా ఫైజ్ ఇటీవ‌ల ఓ సారి ఐసియా ఇంటికి వ‌చ్చాడు. అప్పుడు ఆమె ఎప్పుడూ అడిగిన‌ట్టుగానే పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్ అని అడిగింది. దీనికి ఫైజ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ ఆమెను ఇంటి లోప‌ల బెడ్ రూంలోకి తీసుకెళ్లి దానిపైకి తోసేశాడు. అనంత‌రం ఆమెను గొంతు నులిమి చంపేశాడు. ఈ క్ర‌మంలో పోలీసులు స‌మాచారం తెలుసుకుని వెంట‌నే వ‌చ్చి ఫైజ్‌ను అరెస్ట్ చేశారు. అలా ఫైజ్ త‌న కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక ఆ నిండు గర్భిణీ (32)ని చంపేశాడు. ఏది ఏమైనా ఇలాంటి నీచుల‌కు స‌మాజంలో బ‌తికే హ‌క్కు మాత్రం లేదు క‌దా..!

Comments

comments

Share this post

scroll to top