గర్భిణీని వారు కడుపులో తన్నారు..! చివరకు ఏమైందో తెలుస్తే కన్నీళ్లొస్తాయి..! అసలెందుకిలా చేసారు..?

మన దేశంలో ఏ రాష్ట్రంలో అయినా సరే.. అధికారంలో ఏదైనా పార్టీకి చెందిన ప్రభుత్వం ఉందంటే చాలు.. ఆ పార్టీకి చెందిన గల్లీ నాయకులు కూడా పెద్ద తోపులుగా ఫీలవుతారు. తాము తమ ప్రాంతంలో ఆడిందే ఆట.. పాడిందే పాటగా ప్రవర్తిస్తారు. వసూళ్లకు పాల్పడడం, రియల్‌ ఎస్టెట్‌ ముసుగులో నేరాలు చేయడం, అడ్డు వచ్చిన వారిని బెదిరించడం, వీలైతే చంపడం, జనాలను ఇబ్బందులు పెట్టడం.. ఇలా ఉంటాయి అలాంటి నాయకుల పనులు. ఈ క్రమంలో అలాంటి వల్ల జనాలకు ఇబ్బందే కలుగుతుంది కానీ వారి వల్ల కించిత్‌ ప్రయోజనం కూడా కలగదు. ఆ రాష్ట్రంలోనూ అధికార పార్టీకి చెందిన కొందరు గల్లీ నాయకుల వల్ల ఆ కుటుంబం దారుణంగా అవస్థలను ఎదుర్కొంది. ఆ కుటుంబంలో 4 నెలల గర్భిణీగా ఉన్న మహిళపై సదరు నాయకులు దాడి చేయడంతో ఆమెకు గర్భస్రావం జరిగింది. అయినా ఆ కుటుంబంపై బెదిరింపులు ఆగడం లేదు. ఇంతకీ అసలు జరిగిందేమిటంటే..

అది కేరళలోని కోజికోడ్‌ అనే ప్రాంతం. అక్కడ అధికారంలో ఉంది సీపీఎం ప్రభుత్వం. ఆ పార్టీకి చెందిన గల్లీ నాయకులు కొందరు స్థానికంగా ఉన్న జోశానా సిబ్బీ అనే మహిళకు చెందిన ఇంట్లోకి చొరబడ్డారు. వీధి గుండాల్లా ప్రవర్తించారు. ఆ కుటుంబంపై దాడి చేశారు. సదరు మహిళ భర్తను తీవ్రంగా కొట్టారు. అడ్డు వచ్చినందుకు ఆమెను పొట్టలో తన్నారు. దీంతో 4 నెలల గర్భంతో ఉన్న ఆమెకు గర్భ స్రావమైంది.

అలా జోశానా కడుపులో ఉన్న తన బిడ్డను కోల్పోయింది. అందుకు కారణం ఆ నాయకులే. వారి రాక్షస ప్రవర్తన కారణంగా ఆ కుటుంబానికి తీరని అన్యాయం జరిగింది. ఆమె భర్త ఓ ల్యాండ్‌ కేసులో సాక్షి అట. దీంతో ఆ పార్టీకి చెందిన నాయకులు వచ్చి అతన్ని బెదిరించారు. అయితే సదరు నాయకులు ఇంతటి ఘాతుకానికి పాల్పడడంతో వారిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా కేసు పెట్టినందుకు సదరు నాయకులు మళ్లీ ఆ ఇంటికి వెళ్లి ఆ కుటుంబాన్ని బెదిరించారు. కేసు విత్‌ డ్రా చేసుకోకపోతే జోశానా భర్త కాళ్లు, చేతులను తీసేస్తామని వార్నింగ్‌ ఇచ్చారు. దీంతో ఆ కుటుంబానికి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఏది ఏమైనా అధికారంలో పార్టీ ఉంటే గల్లీ నాయకులు అలా రెచ్చి పోవడం మామూలే. కనుక ఇలాంటి వారిని గెలిపించేముందు ఒకసారి ఆలోచించండి. లేదంటే ఇలాగే ఇబ్బందులు పడాల్సి వస్తుంది..!

Comments

comments

Share this post

scroll to top